పవన్‌కి ఎసరు పెడుతోన్న బాలయ్య!

పవన్‌కి ఎసరు పెడుతోన్న బాలయ్య!

బాలకృష్ణ సినిమాతో పోటీ పడడం వల్ల బిజినెస్‌ పరంగా ఎలాంటి భయం వుండదు కానీ, బాలయ్య చిత్రాలు పోటీకి నిలిచినపుడు థియేటర్ల కొరత మాత్రం వేధిస్తుంటుంది. సీడెడ్‌, గుంటూరు లాంటి ఏరియాల్లో బాలయ్య సినిమా వుందంటే బి, సి సెంటర్లలో థియేటర్లని ముందే బుక్‌ చేసేస్తుంటారు. సింగిల్‌ థియేటర్‌ లేదా డబుల్‌ థియేటర్‌ వున్న ఊళ్లల్లో ముందుగా థియేటర్లు రిజర్వ్‌ చేసి పెట్టుకుంటారు.

దీంతో పోటీగా వచ్చిన సినిమాలకి ఆయా ఊళ్లలో థియేటర్లు దొరకవు. మొదటి వారంలో వసూళ్లు సాధించడమే ఇప్పుడు ఏ సినిమాకి అయినా కీలకం కావడంతో అలాంటి సింగిల్‌ థియేటర్‌ వున్న ఊళ్లల్లో రిలీజ్‌ లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఈసారి ఆ తలనొప్పి పవన్‌కళ్యాణ్‌ సినిమాకి ఎదురు కానుంది. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో చేస్తోన్న 'అజ్ఞాతవాసి' చిత్రం జనవరి 10న రిలీజ్‌ అవుతోంటే, 12న జైసింహా వస్తోంది. దీని వల్ల కేవలం రెండు రోజులు మాత్రమే పవన్‌ సినిమాకి కొన్ని థియేటర్లు దొరుకుతాయి.

సింగిల్‌ థియేటర్‌ వున్న సెంటర్లో కేవలం రెండు రోజులు మాత్రమే ప్రదర్శించడానికి బయ్యర్లు జంకుతారు. దాని వల్ల పైరసీ తాకిడి గట్టిగా వుంటుందనేది వారి భయం. కానీ ఒకవైపు జైసింహా చిత్రానికి గంపగుత్తగా థియేటర్లు బుక్‌ అయిపోతున్నాయి. సంక్రాంతి సీజన్‌ని పూర్తిగా క్యాష్‌ చేసుకునేందుకు బయ్యర్లు ఇప్పట్నుంచే సమర సన్నాహాల్లో వున్నారు.

ఈ సినిమా వల్ల తొలి వారంలో యాడ్‌ అయ్యే సి సెంటర్‌ హైర్లు పవన్‌ సినిమాకి మిస్‌ అవుతాయని ఫాన్స్‌ ఆందోళన పడుతున్నారు. బాలయ్యతో పోటీ అంటే ఇలాంటి స్వీట్‌ పెయిన్స్‌ తప్పవు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు