రూ.20 దొంగతనానికి మూడేళ్ల జైలు శిక్ష..!

మన దేశంలో చాలా మంది బ్యాంకుల సొమ్ము వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టి.. విదేశాలకు పారిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటివారికి కనీసం శిక్ష కూడా వేయలేదు. కానీ… కేవలం రూ.20 దొంగతనం చేశాడనే కారణంతో ఓ వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇది కూడా మన దేశంలోనే.. ముంబయి నగరంలో కావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయి నగరానికి చెందిన ఓ కార్మికుడికి బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు తాజాగా మూడేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.20 దొంగలించాడనే కారణంతో.. ఈ శిక్ష వేయడం గమనార్హం. విచారణలో.. నిందితుడు తన నేరాన్ని అంగీకరించడం గమనార్హం.

అయితే.. దొంగతనం చేసే క్రమంలో.. నిందితుడు.. బాధితుడిని గాయపరిచాడట. అందుకే.. మూడేళ్ల శిక్ష వేశారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా.. దాదాపు ఏడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలోనే అతడు నేరం చేసినట్టు అంగీకరిస్తూ మార్చి నెలలో న్యాయస్థానానికి ఓ లేఖ ద్వారా తెలియజేశాడు.

ఇక.. అతడు స్వచ్ఛందంగా నేరం అంగీరించినట్టు కోర్టు భావిస్తున్నట్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే అతడు ఏడునెలలకు పైగా జైలు జీవితం గడిపిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ జడ్జి నిందితుడికి మూడేళ్ల శిక్ష విధించింది.

ఐపీసీ చట్టాల ప్రకారం.. దోపిడీ సమయంలో బాధితుడు గాయపడినట్టైతే నిందితుడికి గరిష్టంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను కూడా విధించొచ్చు.