ఆడీకారు ఓనర్.. స్విగ్గీ డెలివరీ బాయ్ గా మారి..

అత్యంత ఖరీదైనా కార్లలో ఆడి కూడా ఒకటి. అలాంటి కారుకి ఓనర్ అంటే.. వెనక బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వ్యక్తికి ఫడ్ డెలివరీ చేయాల్సిన అవసరం ఏం ఉంటుంది చెప్పండి..? కానీ ఓ వ్యక్తి అదే చేస్తున్నాడు. ఆడి కారుకి ఓనర్ అయినా.. ఫుడ్ డెలిరీ చేస్తున్నాడు. అది కూడా.. తన ఆడి కారులోనే వెళ్లి చేస్తుండటం విశేషం.

ఇంతకీ మ్యాటరేంటంటే… ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్ చానెల్ ఉంది. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పనులు చేస్తూ.. ఆ వీడియోలను యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగానే ఇప్పుడు తనకు ఉన్న ఆడి ఆర్ 8 కారును స్విగ్గీ డెలివరీకి ఉపయోగిస్తున్నాడు. ఆడీ కారులో ఫుడ్ డెలివరీ ఏంట్రా అని.. అతని వీడియోలను జనాలు కూడా విపరీతంగా చూస్తున్నారు. దీంతో.. అతనికి డబ్బుకి డబ్బు.. ఫేమ్ కి ఫేమ్ వచ్చేస్తున్నాయి.

గతంలో తాను హెచ్2 సూపర్బైక్పై ఫుడ్ డెలీవరీ చేసే వాడినని, అయితే ఆడి కారును ఇందుకు ఉపయోగించొచ్చు కదా అని ప‌లువురు కోర‌డం వ‌ల్ల అలా చేస్తున్నట్లు ఓనర్ చెప్పాడు. తాను ఆడి కారు వాడటం ప్రారంభించిన‌ గంట తర్వాత మొదటి ఆర్డర్ వచ్చిందని, అనంతరం నేరుగా బేకరీకి డ్రైవ్ చేస్కుంటూ వెళ్లినట్లు ఓనర్ చెప్పాడు. ఈ సారి కారు కావడం వల్ల బైక్తో పోల్చితే కాస్త ఇబ్బందిక‌రంగా అన్పించినట్లు తెలిపాడు.

బేకరీ నుంచి కస్టమర్ అడ్రస్కు వెళ్లినప్పుడు ఆ ప్రదేశమంతా ఇరుకుగా ఉండ‌టంతో, కారును కాస్త దూరం ఆపి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని అత‌డు చెప్పాడు. ఆ తర్వాత మరో ఆర్డర్ను ఓకే చేసి.. కస్టమర్ను చేరుకున్నట్లు వీడియోలు పోస్టు చేశాడు.

మొదటి రోజు రెండు ఆర్డర్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు. ట్రాఫిక్ వల్ల కాస్త ఆలస్యమైనా.. కారులో డ్రైవింగ్ సౌకర్యవంతంగా ఉన్నట్లు ఓనర్ చెప్పాడు. ప్రస్తుతం ఇతని ఫుడ్ డెలివరీ వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.