రజనీ ఈ నిర్ణ‌యంతో ఏం చెప్పాల‌నుకున్నాడో

రజనీ ఈ నిర్ణ‌యంతో ఏం చెప్పాల‌నుకున్నాడో

సూప‌ర్ స్టార్ ర‌జనీ కాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీకి రంగం సిద్ధ‌మైందా? ఒక్క‌మాట‌తో త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించ‌గ‌ల స‌త్తా ఉన్న ర‌జనీ రాజ‌కీయ ప్ర‌వేశం కోసం అంతా సిద్ధ‌మైందా? అంటే ఆయ‌న అభిమానుల హ‌డావుడి చూస్తే అవును అనే స‌మాధాన‌మే వ‌స్తోంది. తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ర‌జనీ ప్ర‌క‌టిస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న పాలిటిక్స్ లోకి రావ‌ల్సిందేని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ప్ర‌తిపాద‌న‌ల‌కే ప‌రిమితం అయిన కార్య‌క‌ర్త‌లు ఇప్పుడు ఏకంగా పోస్ట‌ర్ల‌తో త‌లైవ‌ర్ రాజ‌కీయాల్లోకి రావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే అనూహ్య రీతిలో ర‌జ‌నీ మ‌రోమారు ట్విస్ట్ ఇచ్చారు.

త‌మిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్లి అక్కడ మెడిటేషన్ చేసుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే 2002లో దునగిరి ప్రాంతంలో గల గుహల్లో యోగా చేసుకునేందుకు వెళ్ళిన ఆయనకి చెన్నైకి చెందిన వి. విశ్వనాథన్, బెంగళూరుకు చెందిన విఎస్ హరి, విఎస్ మూర్తి, ఢిల్లీకి చెందిన శ్రీధర్ రావులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే స్నేహంగా మారడంతో వీరందరు కలిసి హిమాలయాలలో ఆశ్రమాన్ని నెలకొల్పాలని భావించి ఆ పనిని పూర్తి చేశారు. పరమహంస యోగానందచే స్థాపించబడిన ‘యోగొద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా’(వైఎస్ఎస్) వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆశ్రమాన్ని స్థాపించినట్టు రజనీ స్నేహితులు తెలిపారు. ఈ ఆశ్రమానికి దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చైందని వారు పేర్కొన్నారు. నవంబర్ నుండి ఇది అందుబాటులోకి రానుండగా, హిమాలయాలకి వచ్చే భక్తులకి ఇక్కడ ఉచిత సౌకర్యాలు కలిపించడం జరుగుతుందట. ఇంత‌కీ సీరియ‌స్‌గా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించే ర‌జ‌నీకాంత్‌..ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు