మ‌రో రికార్దు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి-2!

మ‌రో రికార్దు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి-2!

బాహుబ‌లి సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన సంగతి తెలిసిందే. విడుద‌లై ప్ర‌తి చోటా ఈ చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో పాటు, రికార్డు క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసింది. వెండితెర‌పైనే కాదు, బుల్లితెర‌పై కూడా బాహుబ‌లి-2 సిరికొత్త చ‌రిత్ర‌ను లిఖించింది. ద‌క్షిణాది చిత్రాలంటే చిన్న చూపు ఉన్న బాలీవుడ్ సినిమాలు కూడా సాధించ‌లేని ఘ‌న‌త‌ను సాధించింది.

బాలీవుడ్ సినిమాల‌ను త‌ల‌ద‌న్ని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్ర‌సారమైన అన్ని భాష‌ల్లోనూ అత్య‌ధిక‌ టీఆర్పీలు వ‌చ్చిన చిత్రంగా బాహుబ‌లి-2 స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అక్టోబ‌ర్ 8న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో దేశ‌వ్యాప్తంగా వివిధ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మైన ఈ చిత్రం ఆ ఘ‌న‌త సాధించి తెలుగు సినిమా స్టామినాను మ‌రోసారి చాటి చెప్పింది. ఈ విష‌యాన్ని బ్రాడ్‌కాస్ట్ ఆడియ‌న్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్ ఇండియా) అధికారికంగా వెల్ల‌డించింది.

అక్టోబ‌ర్ 7 నుంచి 13 వ‌రకు హిందీలో ప్రసార‌మైన సినిమాల్లో అత్య‌ధిక ఇంప్రెష‌న్స్ సాధించిన‌ టాప్ 5 చిత్రాలను బార్క్ ఇండియా ప్ర‌క‌టించింది. సోనీ మ్యాక్స్ లో ప్రసార‌మైన `బాహుబ‌లి - ది కంక్లూజ‌న్‌` చిత్రం 26054 ఇంప్రెష‌న్స్ తో అగ్ర స్థానంలో నిలిచింది. అర్బ‌న్ ప్రాంతాల్లోనూ 17671 ఇంప్రెష‌న్స్ తో మొద‌టి స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా సాధించలేని రికార్డును బాహుబ‌లి-2 సాధించింద‌ని సినీ   విశ్లేష‌కులు చెబుతున్నారు.

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టించిన `ట్యూబ్‌లైట్‌` చిత్రం 5195 ఇంప్రెష‌న్స్ మాత్ర‌మే ద‌క్కించుకోవ‌డం విశేషం. కాగా, టెలివిజ‌న్ చరిత్ర‌లో అత్య‌ధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిన టాప్ 10 చిత్రాల‌లో బాహుబ‌లి  (21.84)  రెండో స్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి స్థానంలో మ‌గ‌ధీర (22) , మూడో స్థానంలో ఫిదా (21.30) చిత్రం కొన‌సాగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు