బాలయ్య బేనర్ ఇరవయ్యేళ్ల కిందటే..

బాలయ్య బేనర్ ఇరవయ్యేళ్ల కిందటే..

టాలీవుడ్లో సీనియర్ హీరోలందరికీ హోమ్ బేనర్లున్నాయి. ఐతే ఈ మధ్య తమ కుటుంబ పరిధిని దాటి సొంతంగా తమకంటూ ఒక బేనర్ ఉండేలా చూసుకుంటున్నారు కొందరు స్టార్ హీరోలు. నందమూరి బాలకృష్ణ కూడా ఆ బాటలోనే నడిచాడు. ‘బ్రహ్మతేజ క్రియేషన్స్’ బేనర్ మీద  తన తండ్రి బయోపిక్ తీయడానికి రంగం సిద్ధం చేశాడు. తన పిల్లలు ముగ్గురి పేర్లూ కలిసొచ్చేలా బాలయ్య ఈ బేనర్‌ పేరు పెట్టడం విశేషం.

బాలయ్య ఇద్దరు కూతుళ్ల పేర్లు  బ్రహ్మణి, తేజస్వి కాగా.. కొడుకు పేరు మోక్షజ్న తేజ. అందుకే ఆ పేరన్న మాట. ఐతే ఈ ‘బ్రహ్మతేజ క్రియేషన్స్’ బేనర్ మీద సినిమా తెరకెక్కుతున్నది ఇప్పుడే కాబట్టి ఇది కొత్త బేనర్‌లాగా కనిపిస్తోంది కానీ.. నిజానికి ఇది దాదాపు రెండు దశాబ్దాల కిందటే మొదలైన బేనర్ కావడం విశేషం.

బాలయ్య 90ల్లోనే ‘బ్రహ్మతేజ క్రియేషన్స’ బేనర్‌ను రిజిస్టర్ చేయించాడు. తన స్వీయ దర్శకత్వంలో ‘నర్తనశాల’తో పాటు ఇంకొన్ని సినిమాలు చేయాలని సంకల్పించాడు బాలయ్య. కానీ అనివార్య కారణాల వల్ల అప్పుడు ఆ బేనర్ మీద సినిమాలు తీయడం కుదర్లేదు. ఐతే ఇప్పుడు తండ్రి బయోపిక్ కోసం ఈ బేనర్‌ను బయటికి తీశాడు బాలయ్య. ఈ బేనర్ మీద తీయబోయే తొలి సినిమాతో మంచి లాభాలు రాబట్టేందుకు బాలయ్య ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ బయోపిక్ అనగానే జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది కాబట్టి దీనికి బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగే అవకాశముంది. బడ్జెట్ అదుపులో ఉంచకుంటే భారీగా లాభాలు రావడానికి అవకాశముంది. మామూలుగా పారితోషకం గురించి, బడ్జెట్ల గురించి బాలయ్య పట్టించుకోవడం తక్కువ. ఐతే ఇప్పుడు ఆయనకు అన్నీ అనుభవంలోకి వస్తాయి. ఎన్టీఆర్ బయోపిక్‌తో మంచి ఫలితం అందుకుంటే మున్ముందు కూడా బాలయ్య ప్రొడక్షన్ కొనసాగించే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు