మీక్కూడా ఈ సెంటిమెంట్లేంటి నాగ్ సార్??

మీక్కూడా ఈ సెంటిమెంట్లేంటి నాగ్ సార్??

''హిట్లు ఫ్లాపులూ చాలా వస్తుంటాయి, పోతుంటాయి. కాని మనం ఎలాంటి క్యారక్టర్ చేశాం అన్నదే ముఖ్యం. చాలా సినిమాల్లో అసలు సినిమా అంతా నేను ఎందుకున్నానో కూడా నాకు తెలియదు. కాని రాజు గారి గది 2 సినిమాలో నా పాత్ర వేరు'' అంటూ తన పాత్ర గురించి చెబుతూ.. హిట్లూ ఫ్లాపులూ డోంట్ కేర్ అనేసింది సమంత. కాని అక్కినేని నాగార్జున మాత్రం.. ''రేపు సినిమా హిట్టవ్వుద్దా అవ్వదా అనే భయం నాకు ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సమంత ఇంటికొచ్చిన వేళ.. మాకు హిట్టు చాలా ముఖ్యం'' అని చెప్పారు. రాజు గారి గది 2 రిలీజ్ ప్రెస్ మీట్లో ఈ సినిమాపై నాగ్ ఎందుకు భయపడుతున్నారో చెప్పడం.. ఇప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

''ఓ నాలుగు రోజుల క్రితమే చైతన్య అండ్ సమంతల పెళ్ళైంది. ఈ సమయంలో తను మా ఇంటికొస్తున్నప్పుడు నాకు ఫ్లాపు సినిమా వద్దు. హిట్టే కావాలి. అదే నాకు భయంగా ఉంది. రేపెప్పుడన్నా మేం పెళ్ళైన సందర్భం గురించి మాట్లాడుకుంటే.. అప్పుడు మనం భలే హిట్ కొట్టాం కదా అనుకుంటే బాగుంటుంది. కాని ఫ్లాపు సినిమా చేశాం అనుకుంటే బాగోదు. అందుకే ఈ హిట్ చాలా అవసరం'' అన్నారు నాగార్జున. అయితే నిజానికి ఇదే విషయాన్ని మరొక ఇంటర్యూలో ప్రశ్నిస్తే.. ''ఈ సినిమా ఒప్పుకునేటప్పటికి సమంత మా కోడలు కాదు కదా.. అలాంటి లింక్స్ పెట్టి చూడలేను'' అంటూ నాగ్ వివరించారు. చూస్తుంటే నాగ్ రిజల్ట్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారని ఎవరైనా ఇట్టే అర్ధంచేసుకోవచ్చు.

ఈ సినిమా హిట్టవ్వడం అనేది ఓంకార్ తెచ్చిన ఔట్పుట్ బట్టే ఉంటుంది కాని.. వేరొకరి వలన కాదు. కాకపోతే ఒక్కోసారి బెస్ట్ అవుట్పుట్స్ కూడా తన్నేస్తూ ఉంటాయి. ఆల్రెడీ సమంత ఎంగేజ్మెంట్ అయిన తరువాత.. నాగచైతన్య 'యుద్దం శరణం' డిజాష్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా కూడా తన్నేస్తే.. కరక్టుగా పెళ్ళి చేసుకున్న సమయంలో యంగ్ లవ్ బర్డ్స్ ఇద్దరికీ ఫ్లాపులే వచ్చాయంటూ ఎవరన్నా కామెంట్ చేస్తారని నాగ్ ఫీలవుతున్నట్లున్నారు. ఎంతో డేరింగ్ గా సినిమాలు చేసే మీరు కూడా ఇలాంటి సెంటిమెంట్లు పట్టించుకోవడమేంటి నాగ్ సార్??

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు