ఓంకారూ.. నీకో దండమయ్యా బాబూ

ఓంకారూ.. నీకో దండమయ్యా బాబూ

నిజానికి ''రాజు గారి గది 2'' సినిమా చాలా లేటవ్వడానికి ముఖ్య కారణం ఈ సినిమాలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ లేట్ అవ్వడం వలనే అని నాగార్జున చాలాసార్లు చెప్పారు. అయితే ఈ సినిమా మేకింగ్ అప్పుడు కూడా చాలా లేట్లు అయ్యాయ్ అని చాలా రూమర్లు వచ్చాయి. అలాగే నాగార్జున దగ్గరుండి మరీ రీషూట్లు చేయించారని అన్నారు. ఆ రీషూట్లు అన్నీ జరిగిన మాట వాస్తవమే అంటున్నా కూడా.. అసలు లేటవ్వడానికి వేరే కారణం ఉందంటున్నారు నాగ్.

ఈ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్లో 'నాకు ఓసిడి ఉంది' అంటూ స్వయంగా ఓంకారే చెప్పుకున్నాడు. దీనిని కొనసాగిస్తూ.. నాగార్జున కూడా పంచులు పేల్చారు. ''అవును, నిజంగానే ఓంకార్ కు ఓసిడి ఉంది. ఆ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కారణంగానే ఈ సినిమా చాలా లేటైంది. ఆయనకు ఏదీ ఒక పట్టాన నచ్చదు. చేసే యాక్టర్లందరికీ బోర్ కొడుతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అవే షాట్లు తీస్తుంటాడు. చివరకు షూటింగ్ ఆఖరి రోజున నాక్కూడా చిరాకు వచ్చేసింది. నీకో దండమయ్యా ఓంకార్ అనేశాను'' అంటూ నాగ్ నవ్వుతూ నవ్వుతూనే చెప్పేశారు. అయితే అదంతా కూడా ఓంకార్ కు సినిమా పట్ల ఉన్న ప్రేమ కారణంగానే సుమీ.. అతను సినిమా కోసం పడిన తపన ప్రేమ శ్రమ రేపు ధియేటర్లలో చూడండి అంటూ నాగ్ ముగించడం ఒక కొసమెరుపు.

మొత్తానికి నాగ్ మాటలను బట్టి చూస్తుంటే ఓంకార్ కూడా చెక్కుడు దర్శకుల లిస్టులోకి చేరిపోయాడని మనం అర్ధంచేసుకోవచ్చు. ఒకవేళ సినిమా హిట్టయితే ఈ చెక్కుడు అంతా పెద్దగా ఇబ్బందిగా అనిపించదు కాని.. ఎక్కడన్నా తేడా వస్తే మాత్రం కాస్త ఇబ్బందేనయ్యా ఓంకారూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు