హాట్‌: శ్రీదేవి చిన్న కూతురు కూడా రెడీ

హాట్‌: శ్రీదేవి చిన్న కూతురు కూడా రెడీ

మీడియా అటెన్షన్‌ మొత్తం తన అక్కయ్య జాన్వీ కపూర్‌కే వెళ్లిపోతోందని అనుకుందో ఏమో తను కూడా సినీ రంగంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా వున్నాననే సంకేతాలని శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ పంపిస్తోంది. సోషల్‌ మీడియాలో బికినీ ఫోటోలు అప్‌లోడ్‌ చేస్తూ తన అక్కకి తాను ఏమాత్రం తీసిపోననే సంగతి రిజిష్టర్‌ చేయాలని చూస్తోంది.

జాన్వి పెద్దమ్మాయి కనుక, ముందుగా హీరోయిన్‌ అయ్యేది తనే కనుక ఆమె మీదే మీడియా ఫోకస్‌ అధికరగా వుంది. శ్రీదేవి కూడా పెద్ద కూతురిని ఘనంగా లాంఛ్‌ చేయించాలని ఆమె కెరియర్‌ మీదే దృష్టి పెట్టింది. ఈ హంగామాలో తనని ఎవరూ పట్టించుకోవడం లేదని అనుకున్న ఖుషీ తనేంటో ఇంటర్నెట్‌ ద్వారా చూపిస్తోంది.

ఖుషీ బికినీ పిక్స్‌ సర్కులేట్‌ అవడం స్టార్ట్‌ అయిన దగ్గర్నుంచి ఈమెని హీరోయిన్‌గా లాంఛ్‌ చేస్తామంటూ ఎంక్వయిరీలు స్టార్ట్‌ అయ్యాయట. జాన్వి హీరోయిన్‌ అయిన కొద్ది రోజులకే ఖుషీ కూడా వెండితెరని వేడెక్కించడం ఖాయంలాగుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు