బిగ్‌బాస్‌ ఆటలు ఇక్కడ చెల్లవు

బిగ్‌బాస్‌ ఆటలు ఇక్కడ చెల్లవు

'బిగ్‌బాస్‌' షోలో మాంఛి ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్న హరితేజని 'జబర్దస్త్‌' షోకి యాంకర్‌గా తీసుకుంటున్నారనే పుకారు మొదలైంది. రష్మి గౌతమ్‌కి బదులుగా హరితేజ ఈ బ్లాక్‌బస్టర్‌ కామెడీ షోని హోస్ట్‌ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈమధ్య దసరా ఉత్సవాలకి యాంకర్‌ అవతారం ఎత్తడంతో హరితేజ ఇక టీవీ రంగంలో బిజీ అవుతుందనే అనుకుంటున్నారు. అయితే జబర్దస్త్‌ షోకి మాత్రం ఆమెని ఎవరూ సంప్రదించలేదట.

ఈ కామెడీ షోకి కమెడియన్లు చేసే స్కిట్లు ఎంత హిట్టో అనసూయ, రష్మిల గ్లామర్‌ కూడా అంతే ఎస్సెట్టు. హరితేజ ఎంటర్‌టైనర్‌ కావచ్చునేమో కానీ గ్లామర్‌ పరంగా ఆమె అంతగా స్కోర్‌ చేయలేదు. టాప్‌ రేటింగ్స్‌ వచ్చే జబర్దస్త్‌ షోకి ఇప్పుడు మార్పులు చేయాల్సిన అవసరమేమీ లేదు.

అందుకే హరితేజని ఈ షోకి తీసుకోవడం లేదని ఖరాఖండీగా తెలిసింది. కాకపోతే హరితేజకి తొందర్లో కొన్ని ప్రముఖ షోలు చేతికి వచ్చే అవకాశముంది. ముఖ్యంగా సుమ లాంటి సీనియర్లు హోస్ట్‌ చేసే కార్యక్రమాలని ఆమె చేతికి ఇచ్చేయవచ్చు.

బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీని సినీ రంగంలో కూడా వాడుకోవాలని చూస్తోంది కానీ ప్రస్తుతానికి ఆమెకి సినిమాల్లో అంత చెప్పుకోతగ్గ ఆఫర్లు వస్తోన్న దాఖలాలు లేవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు