బాలకృష్ణని మాత్రం వదలట్లేదు

బాలకృష్ణని మాత్రం వదలట్లేదు

'పైసా వసూల్‌' ఫ్లాప్‌ అయినా కానీ బాలకృష్ణకి మాత్రం ఆ సినిమాలో తనని పూరి ప్రెజెంట్‌ చేసిన విధానం బాగా నచ్చింది. అందులోని డైలాగులు, ఏక్‌ పెగ్‌ లా పాట చాలా పాపులర్‌ అవడమే కాకుండా ఏ కామెడీ షోలో అయినా, స్టేజ్‌ షోలో అయినా ఆ పేరడీలే వినిపిస్తున్నాయి. పైసా వసూల్‌ చేసే టైమ్‌లోనే పూరి జగన్‌తో మరో సినిమా చేస్తానని బాలయ్య మాట ఇచ్చాడు.

ప్రస్తుతం తనతో పని చేసే హీరోలు ఎవరూ లేకపోవడంతో ఎలాగైనా ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా బాలయ్యని వదలకుండా తిరుగుతున్నాడు. తన కొడుకు సినిమా ముహూర్తానికి బాలయ్యతో ముహూర్తం పెట్టించుకోవడంతో పాటు ప్రతి విషయంలోను బాలయ్య సలహా సంప్రదింపులే పూరి పాటిస్తున్నాడు.

గతంలో చిరు క్యాంప్‌కి బాగా క్లోజ్‌ అయిన పూరి జగన్నాథ్‌ ఇప్పుడిలా బాలయ్య వెంట పడడానికి మరో కారణం కూడా వుందంటున్నారు. త్వరలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నాడు కనుక తనకి అతడిని డైరెక్ట్‌ చేసే అవకాశాన్ని బాలయ్య ఇస్తాడని పూరి ఆశ అట.

చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ని లాంఛ్‌ చేసిన క్రెడిట్‌ తనదే కనుక బాలకృష్ణ తనయుడిని కూడా లాంఛ్‌ చేయాలని చూస్తున్నాడట. ఈలోగా తన కొడుకుని మెహబూబాతో సక్సెస్‌ఫుల్‌గా లాంఛ్‌ చేసినట్టయితే బాలకృష్ణ మరింతగా తనపై నమ్మకం చూపిస్తాడని భావిస్తున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు