త్రిష రెచ్చిపోయిందిగా..

త్రిష రెచ్చిపోయిందిగా..

లేటు వయసులో హాట్ హాట్‌గా కనిపించే ప్రయత్నం చేస్తోంది త్రిష. ఓ దశలో సినిమాలకు గుడ్ బై చెప్పేసి వ్యక్తిగత జీవితంలో స్థిరపడేలా కనిపించిన త్రిష.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని మళ్లీ హీరోయిన్‌గా బిజీ అయిపోయింది. ఇప్పుడామె చేతిలో అరడజను దాకా సినిమాలుండటం విశేషమే. ఐతే ఇప్పుడున్న యంగ్ హీరోయిన్ల మధ్య నెట్టుకురావాలంటే మామూలుగా కనిపిస్తే కష్టమని భావిస్తున్నట్లుంది త్రిష. తాజాగా ఓ ఫిలిం మ్యాగజైన్ కోసం హాట్ హాట్ ఫొటో షూట్ ఒకటి చేసింది త్రిష. అందులో క్లీవేజ్ అందాలతో పాటు థైస్‌ను కూడా ఎక్స్‌పోజ్ చేస్తూ రెచ్చిపోయిందామె. ఇంతకుముందెన్నడూ త్రిష ఇలా కనిపించింది లేదు.

వయసు ప్రభావం కనిపించనివ్వకుండా బాడీని నునుపు తేల్చి.. అమృతం తాగిన అమ్మాయిలా తయారైంది చెన్నై భామ. ఈ గ్లామర్ డోస్ చూశాక త్రిషకు దర్శక నిర్మాతలు మరిన్ని అవకాశాలిచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం విజయ్ సేతుపతి లాంటి క్రేజీ హీరో సరసన ఓ సినిమా చేస్తున్న త్రిష.. రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. అవి కాక ఇంకో రెండు మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు