హీరోయిన్లతో బలవంతంగా ఓరల్ సెక్స్??

హీరోయిన్లతో బలవంతంగా ఓరల్ సెక్స్??

గత కొన్ని రోజులుగా హాలీవుడ్ ప్రొడ్యూసర్ హార్వే వీన్‌స్టీన్ పేరు మారుమోగిపోతోంది. ది న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక ఈ బడా ప్రొడ్యూసర్ చాలామంది హీరోయిన్లను బలవంతం చేశాడని.. కొందరితో బలవంతపు శృంగారం చేశాడని.. తన పరపతిని డబ్బును.. అలాగే డిస్నీ వారికి అమ్మేసిన తన సొంత కంపెనీ 'మైరామ్యాక్స్'ను అడ్డుపెట్టుకుని చాలామంది అమ్మాయిలపై అఘాయిత్యాలు చేశాడని అరోపించింది. వాటికి సరిపడే ప్రూఫ్ లు కూడా బయటపెట్టింది.

అయితే నిన్నటివరకు కేవలం కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం.. తమతో మిస్ బిహేవ్ చేశాడంటూ ఆరోపించారు. కాని ఇప్పుడు మాత్రం కేవలం అమెరికన్ హీరోయిన్లు మాత్రమే కాకుండా.. ఇతర దేశాల హీరోయిన్లు కూడా ఇతగాడిపై భారీ ఆరోపణలే చేస్తున్నారు. ఇప్పటికే తనకు 1998లో సెక్స్ ను ప్రతిపాదించాడు.. కాని తాను వార్నింగ్ ఇచ్చి అతగాడితో మళ్ళీ పనిచేయకూడదని అనుకున్నానంటూ ఏంజెలినా జోలీ ఆరోపిస్తే.. 1996లో నన్ను తాకరాని చోట తాకాలని వీన్‌స్టీన్ ప్రయత్నించాడు అంటూ గ్వైనెత్ పాల్ట్రో అనే స్టార్ హీరోయిన్ తెలిపింది. లియా సెడాక్స్ అనే మరో హీరోయిన్.. తనపై అతగాడు బలవంతంగా పడ్డాడని.. ముద్దులు పెట్టుకోవాలని ప్రయత్నించాడని.. కాని తాను తప్పించుకున్నట్లు చెప్పింది. ఇవన్నీ ఒకెత్తయితే.. విన్ డీజిల్ XXX సినిమాలో ఎలేనా పాత్రతో పాపులర్ అయిన ఏసియా అర్జెంటో అనే ఇటాలియన్ హీరోయిన్.. వీన్‌స్టీన్ తనపై బలాన్ని ప్రయోగించి.. తనతో ఓరల్ సెక్స్ చేయించుకున్నాడని తెలిపింది. ఇన్నాళ్ళూ ఈ విషయం బయటపెడితే తన కెరియర్ పాడవుతుందని చెప్పలేదు అంటోంది. లూసియా ఇవాన్స్ అనే మరో హీరోయిన్ కూడా వీన్‌స్టీన్ తన మైరామాక్స్ ఆఫీసులోనే ఆమెతో బలవంతంగా ఓరల్ సెక్స్ చేయించాడని చెప్పింది.

ఇలా లిస్టును వెలికితేస్తే.. ఇప్పటికే దాదాపు డజను మంది హీరోయిన్లు ఈ ప్రొడ్యూసర్ కు వ్యతిరేకంగా కామెంట్ చేస్తూ.. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలను చేశారు. అయితే వీన్‌స్టీన్ ఇవన్నీ కొట్టిపారేస్తున్ననప్పటికీ.. ఇంతమంది హీరోయిన్లు ఉత్తినే అభియోగం చేయరు కదా అంటున్నారు సాధరణ ప్రజానీకం. ఇప్పటికే చాలా హాలీవుడ్ సంస్థలు, అసోసియేషన్లు, కంపెనీలు వీన్‌స్టీన్ ను మెంబర్ షిప్ ను అలాగే వివిధ పదవులు నుండీ సస్పెండ్ చేశాయ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు