దిల్‌ రాజు లైఫ్‌ ఇస్తున్నాడా, చంపేస్తున్నాడా?

దిల్‌ రాజు లైఫ్‌ ఇస్తున్నాడా, చంపేస్తున్నాడా?

దిల్‌ రాజు అసోసియేషన్‌ వుంటే తన సినిమాకి అదృష్టమని భావించి గౌరవ సమర్పకుడి బాధ్యతల్ని తీసుకోమని 'జవాన్‌' చిత్రానికి అతడిని పనిగట్టుకుని పెట్టుకున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఈ చిత్రం హిట్‌ అయ్యేట్టు చూస్తానని మాట ఇచ్చిన దిల్‌ రాజు తన సలహాలు, సూచనలు మాత్రం పాటించాలని కండిషన్‌ పెట్టాడు. అలా లాక్‌ అయిపోయిన జవాన్‌ బృందానికి చుక్కలు కనిపిస్తున్నాయి.

ఆగస్టులోనే ఒక పాట మినహా పూర్తయిపోయిన ఈ చిత్రాన్ని ఇంతవరకు రిలీజ్‌ కానివ్వలేదు. కనీసం నవంబర్‌లో అయినా వస్తుందని అనుకుంటే, అదీ జరగదని, డిసెంబర్‌లో రిలీజ్‌ అయితే గొప్పేనని అంటున్నారు. అన్ని డేట్లు మిస్‌ అయి ఫిబ్రవరికి వెళ్లినా కూడా ఆశ్చర్యం లేదని తాజా సమాచారం. తను సలహాలు ఇవ్వడం, మార్పులు చెప్పడమే కాకుండా తనకి తెలిసిన వారికి కూడా సినిమా చూపించి వారు ఇచ్చే సజషన్లు ఫాలో అవండని చెబుతున్నాడట.

దిల్‌ రాజుతో అసోసియేషన్‌ చెడగొట్టుకోలేక హీరో ఏమీ మాట్లాడ్డం లేదని, దర్శకుడు బి.వి.ఎస్‌. రవికి సక్సెస్‌ లేకపోవడంతో అతనూ ఈ సర్కస్‌ అంతా సైలెంట్‌గా చూస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దిల్‌ రాజు లైఫ్‌ ఇస్తున్నాడో లేక దీనిపై వున్న ఆసక్తిని పూర్తిగా చంపేసేలా ఇలా వెనక్కి నెట్టేస్తున్నాడో అర్థం కావడం లేదని కామెంట్లు పడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు