మరీ ఇలా గాలికి వదిలేసారేంటి?

మరీ ఇలా గాలికి వదిలేసారేంటి?

'రాజుగారి గది 2' శుక్రవారం రిలీజ్‌ అవుతోందనే మాటే గానీ ఎక్కడా సరైన ప్రమోషన్లు జరగడం లేదు. నిర్మాత పివిపి సినిమా నుంచి ప్రమోట్‌ చేయాలనే ఉత్సాహమే లేదు. లోకల్‌ మార్కెట్‌ సంగతి ఎలా వున్నా ఓవర్సీస్‌ మార్కెట్‌ కోసం ఆన్‌లైన్‌ ప్రమోషన్లయినా బాగుండాలి. కానీ అవి కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అయిన నాగార్జున, సమంత ఇద్దరూ కూడా పెళ్లి పనుల్లో బిజీగా వుండడంతో దీనిని ప్రమోట్‌ చేసే మరో ఫేస్‌ లేకుండా పోయింది.

కొడుకు పెళ్లి వుందని ముందుగానే ప్రమోషన్‌ ఇంటర్వ్యూలు ఇచ్చేసిన నాగార్జున పెళ్లి తర్వాత ప్రమోషన్స్‌కి రిటర్న్‌ అవ్వలేదు. మరోవైపు నిర్మాతలేమో బాహుబలి సినిమాకి వున్నంత హైప్‌ తమ చిత్రానికి వుందన్నట్టుగా ప్రమోషన్స్‌ చాలా వీక్‌గా చేస్తున్నారు. పాతిక కోట్ల బిజినెస్‌ ఆధారపడి వున్న ఈ చిత్రం ఒక విధంగా ప్రయోగం కూడా.

పాటలు లేకుండా కేవలం హారర్‌, కామెడీ ఎలిమెంట్స్‌ మీదే నడిచే ఈ చిత్రం మాస్‌కి రీచ్‌ అవ్వాలంటే ఇలాంటి డల్‌ ప్రమోషన్స్‌ కూడవు. ఒక్క రోజులో రిలీజ్‌ వుందనగా కూడా అంతే నెమ్మది చూపిస్తోన్న నిర్మాతల ధీమా ఏమిటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఇక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు