ఎన్టీఆర్ బ‌యోపిక్ కు నేనే ద‌ర్శ‌కుడిని: తేజ‌

ఎన్టీఆర్ బ‌యోపిక్ కు నేనే ద‌ర్శ‌కుడిని: తేజ‌

ఎన్టీఆర్ బ‌యోపిక్ ను తెర‌కెక్కించ‌బోతున్నామ‌ని హీరో నంద‌మూరి బాలకృష్ణ గ‌తంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ బ‌యోపిక్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని తేజ‌ను బాల‌య్య కోరారు. బాల‌య్య త‌న‌ను సంప్ర‌దించిన మాట వాస్త‌వ‌మేన‌ని తేజ చెప్పారు. అయితే ఆ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే విష‌యంపై క్లారిటీ మాత్రం ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆ బ‌యోపిక్ పై తేజ స్పందించారు. తానే ఆ బ‌యోపిక్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాన‌ని, త్వ‌ర‌లోనే ఆ సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తామ‌ని చెప్పారు. జనవరి నుంచి ఆ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. తేజ ఇచ్చిన స్టేట్ మెంట్ తో బాల‌య్య తీయ‌బోతున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ పై మ‌రింత క్లారిటీ వ‌చ్చింది.

మరోవైపు దర్శకుడు వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. నిన్న చిత్తూరులో ఆ బ‌యోపిక్ గురించి వ‌ర్మ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ  సినిమా షూటింగ్‌ మొదలు పెట్టి  అక్టోబర్లో రిలీజ్ చేస్తానని వ‌ర్మ ప్ర‌క‌టించారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ కు మొద‌ట వ‌ర్మ‌ను ద‌ర్శ‌కుడిగా అనుకొని ఆ త‌ర్వాత బాల‌య్య త‌న‌ నిర్ణ‌యాన్ని మార్చుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో, వ‌ర్మ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో బాల‌య్య త‌న బ‌యోపిక్ వివ‌రాల‌ను ద‌ర్శ‌కుడు తేజ ద్వారా వెల్ల‌డించిన‌ట్లు ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ రెండు బ‌యోపిక్ ల షూటింగ్ లు పోటాపోటీగా జ‌ర‌గ‌నుండ‌డంతో ఎన్టీఆర్ అభిమానుల‌లో ఓ ర‌క‌మైన ఉత్కంఠ ఏర్ప‌డింది. ఈ రెండు చిత్రాలు కూడా దాదాపుగా ఒకే స‌మ‌యంలో విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్న‌ట్లు టాలీవుడ్ టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు