కొడుకుతో ఇంత ప్రయోగం అవసరమా?

కొడుకుతో ఇంత ప్రయోగం అవసరమా?

వెరైటీ చిత్రాలకి పెట్టింది పేరయిన విక్రమ్‌ తనయుడు ధృవ్‌ని హీరోగా పరిచయం చేయడానికి మాత్రం సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నాడు. తెలుగులో బ్లాక్‌బస్టర్‌ అయిన అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని విక్రమ్‌ తనయుడితో రీమేక్‌ చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ మాదిరిగా లుక్‌, మెచ్యూరిటీ ధృవ్‌లో లేవు. మరి ఈ పాత్రకి అతను ఎంత సూట్‌ అవుతాడనేది తెలియదు కానీ అర్జున్‌ రెడ్డి ఫాన్స్‌ మాత్రం ధృవ్‌కి అంత సీన్‌ లేదనేస్తున్నారు.

అర్జున్‌ రెడ్డి రీమేకే ఒక ప్రయోగం అనుకుంటే ఈ చిత్రాన్ని తీసుకెళ్లి తన గురువు బాలా చేతిలో పెట్టాడు విక్రమ్‌. హీరోగా తనని నిలబెట్టిన బాలాకి కొద్ది కాలంగా విజయాలు లేవు. అయినప్పటికీ అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని తీసే బాధ్యత అతనికే అప్పగించాడు. బాలా సినిమాలంటేనే ఒక విధమైన డార్క్‌ థీమ్స్‌తో చాలా వెరైటీగా వుంటాయి.

మరి అర్జున్‌రెడ్డి లాంటి బోల్డ్‌ సినిమాని బాలా తిరిగి తీయగలడా? తనయుడి తొలి చిత్రంలోనే అతడిని అంత బోల్డ్‌గా చూపించడానికి విక్రమ్‌ అంగీకరించగలడా?అర్జున్‌ రెడ్డి సినిమాలోని నిజాయితీని ఏమాత్రం డైల్యూట్‌ చేసినా ఆ చిత్రం సక్సెస్‌ కాగలదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు