అట్టర్ ఫ్లాప్ సినిమాను తెలుగులోకి తెస్తారట

అట్టర్ ఫ్లాప్ సినిమాను తెలుగులోకి తెస్తారట

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఐ’ సినిమా కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడి.. ఆ సినిమా నుంచి బయటికి వచ్చిన తర్వాత తమిళ స్టార్ హీరో విక్రమ్ తమిళంలో ఓ సినిమా చేశాడు. అదే.. 10 ఎన్రదుకుల్లా. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకుడు. సమంత రూత్ ప్రభు కథానాయికగా నటించింది. ఈ సినిమాకు తమిళంలో డిజాస్టర్ టాక్ వచ్చింది.

విక్రమ్ దీని తర్వాత నటించిన ‘ఇంకొక్కడు’కు కొంచెం హైప్ వచ్చింది. అది ఫ్లాప్ అయినా దాని గురించి కొంచెం చర్చ అయినా జరిగింది. కానీ ‘10 ఎన్రదుకుల్లా’ గురించి అసలు డిస్కషనే లేదు. అంత పెద్ద ఫ్లాప్ ఆ సినిమా. అలాంటి సినిమాను ఇప్పుడు తెలుగులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ‘10’ అనే టైటిల్ తో ఈ సినిమా పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అక్టోబర్లో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట.

అసలే ఫ్లాప్ సినిమా.. పైగా విడుదలై రెండేళ్లు దాటింది. ఇలాంటి సినిమాను ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చి ఏం సాధిస్తారో? ఓ తమిళ హీరోకు తెలుగులో కొంచెం క్రేజ్ రాగానే.. అతడి చెత్త సినిమాల్ని కూడా తెలుగులోకి అనువదించేయడం మామూలే.

కానీ విక్రమ్ తెలుగులో మార్కెట్.. క్రేజ్ కోల్పోయి చాలా కాలమైంది. మరి ఇప్పుడు ‘10 ఎన్రదుకుల్లా’ లాంటి డిజాస్టర్ మూవీతో సాహసాలేంటో? పైగా తెలుగు సినిమాలకే ఖాళీ లేని అక్టోబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు