బిగ్‌బాస్‌ వల్ల ఒరిగేది ఏమైనా వుందా?

బిగ్‌బాస్‌ వల్ల ఒరిగేది ఏమైనా వుందా?

అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ బిగ్‌బాస్‌ ఫస్ట్‌ సీజన్‌ టైటిల్‌ శివబాలాజీ గెలుచుకున్నాడు. హౌస్‌లో ఎలా వుండకూడదో అలా వుంటున్నట్టు కనిపించిన శివబాలాజీ ఆది నుంచీ సెకండ్‌ టయర్‌లోనే నిలుస్తూ వచ్చాడు తప్ప టాప్‌ కంటెండర్‌ అనిపించుకోలేదు.

హరితేజ, నవదీప్‌ మాదిరిగా పాపులర్‌ కాలేకపోయిన శివబాలాజీ చివరకు బిగ్‌బాస్‌ టైటిల్‌ అయితే గెలిచేసుకున్నాడు. చాలా ఏళ్ల క్రితమే నటుడిగా పరిచయమైన శివబాలాజీ నటించినవి తక్కువ సినిమాలే. ఆర్య, చందమామ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ నటుడిగా బిజీ కాలేకపోయాడు.

రీసెంట్‌గా రిలీజ్‌ అయిన కాటమరాయుడులో పవన్‌ తమ్ముడిగా కనిపించిన శివబాలాజీకి దాంతోను బ్రేక్‌ రాలేదు. బిగ్‌బాస్‌ షో వల్ల పాపులర్‌ అయితే అయ్యాడు కానీ అతడికి అవకాశాలను తెచ్చి పెడుతుందా అనేది అనుమానమే. కామెడీ అంతగా చేయలేడు కనుక, హీరోగా సూట్‌ అయ్యే ఫిజిక్‌ లేదు కనుక క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్రలతో సరిపెట్టుకోవాలి. అయితే ఆ పాత్రల్లో షైన్‌ అయ్యే ప్రత్యేక టాలెంట్‌ కూడా అతనిలో కనిపించదు.

టైటిల్‌ విన్నర్‌ అయినప్పటికీ కెరియర్‌ పరంగా శివబాలాజీకి పెద్ద ఊపు రాదని విశ్లేషకులు భావిస్తున్నారు. హరితేజ ఎక్కువ బెనిఫిట్‌ అవుతుందని, నవదీప్‌కి కూడా అవకాశాలు మెరుగవుతాయని అంటున్నారు. చూద్దాం ఈ బిగ్‌బాస్‌ ఎందరి జాతకాలు మార్చి ఎవరిని ఎక్కడ నిలబెడుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు