బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్‌పై మహేష్..

బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్‌పై మహేష్..

ప్రతి స్టార్ హీరో కెరీర్లోనే ఫ్లాపులుంటాయి. డిజాస్టర్లుంటాయి. ఐతే ప్రతికూల ఫలితం రావడం సహజమే కానీ.. ఒక సినిమా గురించి ప్రేక్షకులు మరీ ఎగతాళిగా మాట్లాడుకుంటే ఆ ఫలితం ఏ హీరోకైనా చాలా ఇబ్బంది కలిగించే విషయమే. మహేష్ బాబు సినిమా ‘బ్రహ్మోత్సవం’ విషయంలో ఇదే జరిగింది. ప్రేక్షకులకు తీవ్ర అసహనం కలిగించిన సినిమా ఇది. దీన్ని సీరియళ్లతో పోలుస్తూ సోషల్ మీడియాలో దారుణమైన రీతిలో ట్రోల్ చేశారు.

ఆ ట్రోల్స్ మీద పెద్ద చర్చే నడిచింది. మహేష్ బాబు సహా ‘బ్రహ్మోత్సవం’ చిత్ర బృందమంతా తమ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి షాకైపోయింది. ఐతే ఈ సినిమా ఫలితం గురించి ఎన్నడూ మాట్లాడని మహేష్ బాబు.. ఇప్పుడు ఓపెనయ్యాడు. ఆ సినిమా తనను ఎంత నిరాశకు గురి చేసిందో వివరించాడు.

బ్రహ్మోత్సవం సినిమా ఫలితంపై నిరాశ చెందారా అని అడిగితే.. ‘‘అలాంటి ఫ్లాపులు వచ్చినప్పుడు కచ్చితంగా డిప్రెషన్‌ ఉంటుంది. దాని నుంచి నన్ను బయటపడేసేది నా పిల్లలే. వాళ్లతో ఉంటే ఆ బాధ తగ్గిపోతుంది. ‘బ్రహ్మోత్సవం’ ఫలితానికి బాగా డిజప్పాయింట్‌ అయిన మాట నిజం. ఆ సినిమా చేయాలన్న నిర్ణయం తప్పు. దాని వల్ల చాలా మంది డబ్బులు పోయాయి. చాలా మంది బాధపడ్డారు. నన్ను నమ్మి డబ్బులు పెట్టిన వాళ్లు నష్టపోతే కలిగే బాధను మాటల్లో వివరించలేను. అలాంటి అనుభవాలే పాఠాలు.

మరోసారి అలాంటి స్థితి రాకుండా చూసుకొనే బాధ్యతను ఫీలవుతాను. కొన్ని సార్లు మనం అనుకున్నవి తలకిందులవుతుంటాయి. ‘బ్రహ్మోత్సవం’ సినిమా కూడా అలాంటిదే. మేమేదో మంచి చెప్పాలనుకున్నాం. కానీ అది తిరగబడింది’’ అని మహేష్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు