సూపర్ స్టార్ మాంచి స్పీడు మీదున్నాడే

సూపర్ స్టార్ మాంచి స్పీడు మీదున్నాడే

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేని ఇమేజ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ది. రజినీ సినిమా ఒకటి ఫ్లాపైనా.. దాని ప్రభావం తర్వాతి సినిమాపై పడదు. ఆయన సినిమా వస్తే పండగే అభిమానులకు. సూపర్ స్టార్ నటించిన చివరి మూడు సినిమాలు ‘కోచ్చడయాన్’.. ‘లింగా’.. ‘కబాలి’ ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేశాయి. అయినప్పటికీ సూపర్ స్టార్ కొత్త సినిమా ‘2.0’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఈ సినిమా కోసం దేశవ్యాప్తగా సినీ ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ రికార్డుల్ని కూడా బద్దలు కొట్టగల సత్తా ఉన్న సినిమాగా దీన్ని చెబుతున్నారు. వచ్చే మూడు నెలల్లో ఉద్ధృతంగా ఈ సినిమాను ప్రమోట్ చేసి జనవరి 25న విడుదల చేయబోతున్నారు.

‘కబాలి’ లాంటి మామూలు సినిమాకే ఎలాంటి హైప్ వచ్చిందో.. ఆ సినిమా రిలీజ్ టైంలో ఎలాంటి హంగామా నెలకొందో తెలిసిందే. ఇక ‘2.0’ విడుదల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. జనవరి నెలంతా సూపర్ స్టార్ అభిమానులకు పండగే. ఐతే ఈ పండగ ముగిసిన ఇంకో మూణ్నాలుగు నెలలకే రజినీ అభిమానులు ఇంకో పండగ చూడబోతున్నారు.

‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో రజినీ నటిస్తున్న ‘కాలా’ కూడా 2018 ప్రథమార్ధంలోనే విడుదలవుతుందట. ఈ సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అక్టోబరు చివరి కల్లా సినిమాను పూర్తి చేసేయాలని చూస్తున్నారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతాయి. ‘2.0’ సందడి ముగిశాక కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ సినిమాను ఏప్రిల్ లేదా మే నెలలో రిలీజ్ చేస్తారట. కాబట్టి మూణ్నాలుగు నెలల వ్యవధిలో రజినీ అభిమానులకు డబుల్ ధమాకానే అన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు