జై, స్పైకి బ్యాండ్‌ పడిపోతోంది!

జై, స్పైకి బ్యాండ్‌ పడిపోతోంది!

జిఎస్‌టి అమలుతో సినిమా షేర్లు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అయితే జిఎస్‌టి అమల్లోకి వచ్చిన దగ్గర్నుంచి తెలుగులో భారీ చిత్రాలేవీ రిలీజ్‌ కాలేదు. ఎక్కువగా లో బడ్జెట్‌, మీడియం బడ్జెట్‌ చిత్రాలే రావడంతో, వాటిలో చెప్పుకోతగినన్ని విజయాలు వుండడంతో దాని ఎఫెక్ట్‌ ఎక్కువగా తెలియలేదు. కానీ భారీ చిత్రాలు వస్తోన్న ఈ సీజన్‌లో జిఎస్‌టి ఎఫెక్ట్‌ సినిమా బిజినెస్‌పై బాగా కనిపిస్తోంది.

డిస్ట్రిబ్యూటర్లు దీనిని లెక్క చేయకుండా భారీ రేట్లు పెట్టినప్పటికీ, థర్డ్‌ పార్టీలు, ఎగ్జిబిటర్లు మాత్రం మునుపటిలా దూకుడు చూపించడం లేదు. ముఖ్యంగా బి అండ్‌ సి సెంటర్స్‌ నుంచి వచ్చే ఫిక్స్‌డ్‌ హైర్లు రావడంలేదు. ఎక్కువ మంది మినిమం గ్యారెంటీ పద్ధతికే మొగ్గు చూపుతున్నారు. జిఎస్‌టి వల్ల సినిమాలు ఎంత కాలం థియేటర్లలో రన్‌ అవుతాయో, ఎంతవరకు షేర్‌ తెచ్చుకుంటాయో తెలియడం లేదు. అందుకే రిస్క్‌ దేనికని మునుపటిలా ముందే మొత్తం చెల్లించేసి రైట్స్‌ తీసుకోవడం లేదు.

ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్‌కి కూడా రిస్క్‌ షేర్‌ అయ్యేలా మినిమం గ్యారెంటీ పద్ధతిలోనే కొంటున్నారు. ఇక ముందు కూడా థర్డ్‌ పార్టీలు ఇదే ధోరణి ప్రదర్శిస్తే మాత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌పై ఎఫెక్ట్‌ పడుతుంది. రిస్క్‌ పెరిగినపుడు బయ్యర్లు కూడా వెనకా ముందు చూడకుండా రైట్స్‌ తీసుకోవడం జరగదు కనుక పెద్ద సినిమాల థియేట్రికల్‌ బిజినెస్‌ పరంగా లోటు పడుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు