ఎన్టీఆర్‌ వచ్చేసరికి వుండేదెవరో?

ఎన్టీఆర్‌ వచ్చేసరికి వుండేదెవరో?

దసరా సెలవులు మొదలు కానున్న దశలో సెప్టెంబర్‌ 21న 'జై లవకుశ' రిలీజ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత స్పైడర్‌, మహానుభావుడు రూపంలో మరో రెండు సినిమాలతో బాక్సాఫీస్‌ బిజీ కానుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి దీపావళి వరకు థియేటర్లు దొరికే పరిస్థితి లేదు. దీంతో ఈ వారంలోనే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలు చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయి. సునీల్‌ నటించిన 'ఉంగరాల రాంబాబు' వీటన్నిటిలోకి కాస్త పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు. అలాగే చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న నారా రోహిత్‌ సినిమా 'కథలో రాజకుమారి' కూడా రేపు రిలీజ్‌ కానుంది.

బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్‌ స్వీయ రచనలో దర్శకత్వం వహించిన 'శ్రీవల్లి' అనే ఎరాటిక్‌ థ్రిల్లర్‌ కూడా రేపే వస్తోంది. సచిన్‌ చాలా గ్యాప్‌ తర్వాత వీడెవడు అనే చిత్రంతో వస్తున్నాడు. ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ నటి ఈషా గుప్తా కథానాయికగా నటించింది. ఇవి కాకుండా ఒక రెండు, మూడు అనువాద చిత్రాలు కూడా రేపే వెలుగు చూస్తున్నాయి.

జై లవకుశ వచ్చేసరికి వేటిని థియేటర్లలో వుంచాలి, వేటిని తీసేయాలనేది రేపు తేలిపోతుంది. వీటిలో బాగుందని పేరొచ్చి, కలెక్షన్లు తెచ్చుకున్న సినిమాలకి స్పైడర్‌, మహానుభావుడు వచ్చే వరకు థియేటర్లలో వుండే వీలుంటుంది. లేదంటే మొదటి వారంలోనే తిరుగు టపా తప్పదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు