ఆ సినిమా హోల్డ్‌లో పెట్టిన రవితేజ

ఆ సినిమా హోల్డ్‌లో పెట్టిన రవితేజ

ఏడాదికి పైగా విరామం తీసుకున్న తర్వాత ఒకేసారి రెండు సినిమాలు మొదలు పెట్టిన రవితేజ 'రాజా ది గ్రేట్‌', 'టచ్‌ చేసి చూడు' రెండిటినీ ప్యారలల్‌గా చేస్తూ వచ్చాడు. అయితే ఒక పాయింట్‌ తర్వాత 'టచ్‌ చేసి చూడు' చిత్రాన్ని హోల్డ్‌లో పెట్టి, 'రాజా ది గ్రేట్‌'ని ముందుకి నడిపించాడు. ఈ చిత్రాలని నెల రోజుల వ్యవధిలో విడుదల చేయాలని మొదట భావించినా కానీ, రెండిటి మధ్య మూడు, నాలుగు నెలల విరామం వున్నా మంచిదేనని డిసైడ్‌ అయి ఆ చిత్రాన్ని వెనక్కి నెట్టారట.

ఇంత గ్యాప్‌ తర్వాత ఈ రెండు సినిమాల్లో ఏది ముందొస్తే బెటర్‌ అని ఆలోచించి, రాజా ది గ్రేట్‌కే రవితేజ ఓటేసాడట. దిల్‌ రాజు నిర్మాత కావడంతో పబ్లిసిటీ పరంగా, థియేటర్ల కేటాయింపు పరంగా ఎలాంటి లోటు జరగదు కనుక, అలాగే అంధుడిగా డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తోన్న చిత్రం నుక ఇది ప్రేక్షకులకి కొత్తగా అనిపిస్తుందని, ఈ గ్యాప్‌ తర్వాత ఇదే బెటర్‌ మూవీ అని రవితేజ దీనిని ముందుకి తెచ్చాడని టాక్‌.

టచ్‌ చేసి చూడు చిత్రాన్ని నవంబర్‌ నుంచి తిరిగి పట్టాలెక్కించి, ఫిబ్రవరి నాటికి రెడీ చేస్తారని సమాచారం. కొంత కాలంగా తన స్థాయికి తగ్గట్టు పర్‌ఫార్మ్‌ చేయలేకపోతున్న రవితేజ ఇంత గ్యాప్‌ అనంతరం అయినా తిరిగి తారాపథంలోకి వెళతాడో లేదో అనేది వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు