కేసీఆర్ తెలంగాణ గాంధీ: మంచు వార‌బ్బాయి

కేసీఆర్ తెలంగాణ గాంధీ: మంచు వార‌బ్బాయి

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అనూహ్య‌మైన ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టి, తెలుగు భాషా పరి రక్షణకు పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో మొదటి తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను క‌చ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలి. అదేవిధంగా తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులను క‌చ్చితంగా తెలుగులోనే రాయాలని పేర్కొన్నారు. మంచు మ‌నోజ్ తెలంగాణ గాంధీగా అభివ‌ర్ణించాడు.

ఇలా కేసీఆర్ తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు ప‌ట్ల మంచు మ‌నోజ్ సంతోషం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశాడు. "మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు" అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఇప్ప‌టికే ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేసిన సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ వెంకయ్య ట్వీట్ చేశారు. ఇతర రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మాతృభాషకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ కూడా అమలు చేస్తుందని ఆశిస్తున్నానని వెంకయ్య పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు