పది తలల ఎన్టీఆర్.. అదిరిందిలే

పది తలల ఎన్టీఆర్.. అదిరిందిలే

తెలుగు ప్రేక్షకులకు అత్యంత ప్రీతి పాత్రమైన పురాణ పాత్రల్లో రావణాసురుడిది ఒకటి. ఈ పాత్ర నేపథ్యంలో అప్పట్లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఈ పాత్రను అద్భుతంగా పోషించిన నటుల్లో ఎన్టీఆర్ ఒకడు. ఆయనకు ఆ పాత్ర చాలా ఇష్టం కూడా. ఇప్పుడు ఎన్టీఆర్ మనవడు చిన్న ఎన్టీఆర్ రావణాసురుడి పాత్ర స్ఫూర్తితో ఓ క్యారెక్టర్ చేస్తున్నాడు. ‘జై లవకుశ’లో జై పాత్ర కు స్ఫూర్తి రావణాసురుడే. ఫస్ట్ టీజర్ దగ్గర్నుంచి ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూనే ఉన్నారు. అసుర అసుర అసుర రావణాసుర.. అంటూ ఈ పాత్ర లక్షణాల్ని చెప్పే ఒక పాట కూడా ఈ సినిమాలో ఉంది. ఇప్పుడు ఈ పాత్రకు మరింతగా రావణాసురుడి లక్షణాల్ని ఆపాదిస్తూ ఒక పోస్టర్ వదిలారు.

జై రూపంలో పది తలల ఎన్టీఆర్‌ను చూపిస్తూ ఒక పోస్టర్ షేర్ చేశాడు ‘జై లవకుశ’ నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్. అది భలేగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది. ‘జై లవకుశ’ సెన్సార్ పూర్తయిన నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఈ పోస్టర్ షేర్ చేశాడు. ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో పాటు సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాపై ప్రశంసలు కురిపించినట్లు దర్శకుడు బాబీ వెల్లడించాడు. ఈ చిత్ర నిడివి 2 గంటల 35 నిమిషాలని చెబుతున్నారు. సెప్టెంబరు 21న.. గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది ‘జై లవకుశ’.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు