త్రివిక్రమ్‌ గేమ్‌ ప్లాన్‌ అదరహో

త్రివిక్రమ్‌ గేమ్‌ ప్లాన్‌ అదరహో

పవన్‌కళ్యాణ్‌ ఇరవై అయిదవ చిత్రాన్ని త్రివిక్రమ్‌ తన సొంత బ్యానర్‌ లాంటి హారికా హాసిని క్రియేషన్స్‌లో చేస్తున్నాడు. ఈ సినిమా తన బ్యానర్‌కి వచ్చేటట్టు చూసుకోవడంలో త్రివిక్రమ్‌ పావులు కదిపిన తీరు గురించి ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకుంటారు. వంద కోట్ల బడ్జెట్‌ ఇచ్చి, పది కోట్ల లాభం చూపిస్తానని చెప్పిన త్రివిక్రమ్‌ తర్వాత ఆ బడ్జెట్‌ని మరో ఇరవై కోట్లు పెంచి, ముప్పయ్‌ కోట్ల లాభం చూపిస్తున్నాడట.

ఇదిలావుంటే ఈ చిత్రానికి వస్తోన్న ఆఫర్ల కంటే మరింత ఎక్కువ రేట్లు ఇవ్వడానికి పలువురు సిద్ధంగా వున్నా కానీ సంక్రాంతికి విడుదలయ్యే చిత్రం కనుక స్ట్రాంగ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ వుండాలని, వేరే ఏ సినిమాలు వచ్చినా కానీ దీనికి థియేటర్ల పరంగా లోటు రాకూడదని చెప్పాడట. అందుకే ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోను తల పండిన బయ్యర్లే వుంటారు. మార్కెట్‌ రేటు మీద కొంత పర్సంట్‌ తక్కువ ఆఫర్‌ చేసినా కానీ దాని వల్ల వచ్చే అడ్వాంటేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని నిర్మాతకి చెప్పాడట.

అందుకే వచ్చిన ఆఫర్లు కూడా కాదని టాప్‌ డిస్ట్రిబ్యూటర్ల చేతిలో ఈ చిత్రాన్ని పెడుతున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు వీరంతా టాప్‌ క్లాస్‌ థియేటర్లు పెద్ద సంఖ్యలో బ్లాక్‌ చేస్తారు కనుక ఈ చిత్రం ఓపెనింగ్స్‌ పరంగా సంచలనాలు చేయడం ఖాయమని, కాంపిటీషన్‌ గురించి ఆలోచించాల్సిన పని లేదని చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు