రకుల్‌ ఓ రేంజ్‌లో దుమ్ము రేపుతోంది

రకుల్‌ ఓ రేంజ్‌లో దుమ్ము రేపుతోంది

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోను డిమాండ్‌ పెరిగింది. తెలుగు, తమిళ భాషల్లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోన్న రకుల్‌ త్వరలో ఒక బాలీవుడ్‌ ఏ లిస్ట్‌ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది. 'అయియారీ' అనే చిత్రంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయకిగా నటిస్తోంది. మామూలుగా అయితే సిద్ధార్థ్‌ హీరో కనుక ఈ చిత్రం గురించి అంత ఎక్సయిట్‌ అవ్వాల్సిన పని లేదు.

అతనికి ఈమధ్య వరుస ఫ్లాప్‌లున్నాయి. కానీ ఈ చిత్రానికి దర్శకుడు నీరజ్‌ పాండే. ఎన్నో ఉత్తమ చిత్రాలని అందించిన నీరజ్‌ పాండేకి అద్భుతమైన ట్రాక్‌ రికార్డ్‌ వుంది. అతని సినిమాలకి ఓపెనింగ్స్‌ బ్రహ్మాండంగా వుండడమే కాకుండా రీచ్‌ చాలా వుంటుంది. గతంలో ఒక చిన్న సినిమాలో నటించిన రకుల్‌కి ఇది బాలీవుడ్‌లో చాలా పెద్ద బ్రేక్‌ అవుతుంది. ఒక్కసారిగా ఆమె స్టార్‌ హీరోల దృష్టిలో పడినా ఆశ్చర్యం లేదు.

అందుకే బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తున్నా కానీ నీరజ్‌ సినిమా విడుదలయ్యే వరకు రకుల్‌ వేచి చూస్తోంది. తెలుగు, తమిళంలో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న రకుల్‌, బాలీవుడ్‌లో మాత్రం ప్రస్తుతానికి పారితోషికంతో పని లేదని తెలివిగా ఆడుతోంది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లిన ఎవరూ అంత సక్సెస్‌ కాని నేపథ్యంలో రకుల్‌ బాలీవుడ్‌ ఫ్యూచర్‌ ఎలా వుంటుందనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు