పూరీకి డబ్బులిచ్చే వారే లేరట!

పూరీకి డబ్బులిచ్చే వారే లేరట!

ప్రేక్షకుల అభిరుచి మీద కించిత్‌ గౌరవం లేకుండా, ఇష్టమొచ్చిన కథలతో తలా తోకా లేని సినిమాలు తీస్తూ పోయిన పూరి జగన్నాథ్‌ ఇప్పుడు ఇరకాటంలో పడ్డాడు. ఇంతవరకు తన బ్రాండ్‌ వాడుకుని అవకాశాలు దక్కించుకున్న జగన్‌ 'పైసా వసూల్‌'తో తన ఇమేజ్‌ని టోటల్‌గా డ్యామేజ్‌ చేసుకున్నాడు. ఈమధ్య అతను తీసిన రోగ్‌, పైసా వసూల్‌ చిత్రాలు చూస్తే పూరి స్థాయి ఎంతగా పడిపోయిందనేది తెలుస్తుంది.

ప్రతి సినిమాతోను బయ్యర్లని, నిర్మాతలని నిలువునా ముంచేస్తోన్న పూరి మలి చిత్రానికి నిర్మాతలు ఎవరూ లేరు. స్వీయ నిర్మాణంలో తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ ఇడియట్‌ లాంటి సినిమా ఏదో ప్లాన్‌ చేస్తున్నాడు. నిర్మాత పూరి అయినా, ఇలాంటి సినిమాలకి వెనుక నుంచి ఫండ్స్‌ సప్లయ్‌ చేసేవాళ్లుంటారు. క్రేజీ దర్శకుడి మీద నమ్మకంతో లాభాల్లో వాటా తీసుకుని పెట్టుబడి పెడుతుంటారు.

కానీ పూరి జగన్నాథ్‌ మీద ఇప్పుడు నమ్మకం పూర్తిగా సడలిపోవడంతో అతడితో సినిమా అంటేనే అందరూ వెనకాడుతున్నారట. పూరి సినిమాకి ఇకపై మార్కెట్లో గిట్టుబాటు ధర కూడా పలకదనే ఫీలింగ్‌ వచ్చేయడంతో పూరి జగన్నాథ్‌ని పూర్తిగా ఇగ్నోర్‌ చేస్తున్నారట. మరి ఈసారైనా అందరి నోళ్లు మూయించే ఘన విజయాన్ని పూరి అందిస్తాడో లేదో అనేది చూడాలి. తనయుడి కెరియర్‌ స్టేక్‌లో వుంది కనుక జాగ్రత్తగా వుంటాడనే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు