టాప్‌ లేపేసిన పవన్‌కళ్యాణ్‌

టాప్‌ లేపేసిన పవన్‌కళ్యాణ్‌

ఇంకా టైటిల్‌ కూడా అనౌన్స్‌ చేయలేదు. సినిమా ఎలా వుంటుంది, ఏ జోనర్‌ అనేదానిపై ఐడియా లేదు. కానీ కాంబినేషన్‌ క్రేజ్‌తో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో వున్నాయి. పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా పంపిణీ హక్కుల కోసం పోటీ న భూతో న భవిష్యతి అన్న రీతిన జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోను బాహుబలి తర్వాతి స్థానం ఈ చిత్రానికే దక్కింది. విడుదలకి ముందు జరిగిన బిజినెస్‌లో మిగతా సినిమాల కంటే ఈ చిత్రం ఎన్నో అడుగుల ఎత్తులో వుంది. ఓవర్సీస్‌ రైట్స్‌ని బ్లూ స్కై సంస్థ ఇరవై ఒక్క కోట్లకి కొనుగోలు చేయడం ట్రేడ్‌ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. బాహుబలి తర్వాత ఇంత రేటు పలికిన మరో తెలుగు సినిమా లేదసలు. కనీసం అయిదు మిలియన్‌ డాలర్లు వసూలు చేస్తే తప్ప కొన్న రేటుకి వర్కవుట్‌ కాని మొత్తానికి ఈ హక్కులు తీసుకున్నారంటేనే ఈ చిత్రంపై నమ్మకం ఎంత వుందనేది అర్థం చేసుకోవచ్చు.

ఈ చిత్రం హక్కుల కోసం అన్ని చోట్లా ఇదే స్థాయి స్పందన వుంది. నైజాం ఏరియా హక్కులని దిల్‌ రాజు ఇరవై తొమ్మిది కోట్లు ఎన్‌ఆర్‌ఏ పద్ధతిలో చెల్లించి తీసుకున్నాడు. బాహుబలి తర్వాత ఇదే హయ్యస్ట్‌ అమౌంట్‌ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇదే రీతిన అన్ని చోట్లా రికార్డు రేట్లు పలుకుతోన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ నూట యాభై కోట్ల పైమాటేనని ట్రేడ్‌ టాక్‌. వారెవ్వా పవర్‌స్టార్‌ అనిపిస్తోంది కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు