ఇంతకీ ‘జై లవకుశ’లో ఆయనేంటి?

ఇంతకీ ‘జై లవకుశ’లో ఆయనేంటి?

ఇంతకీ ‘జై లవకుశ’లో ఆయనేంటి?‘జై లవకుశ’కు సంబంధించి టీజర్లలో అయినా.. ట్రైలర్లో అయినా.. పోస్టర్లలో అయినా ఎన్టీఆరే హైలైట్ అవుతున్నాడు. ఒకటికి మూడు పాత్రలు చేయడంతో స్క్రీన్ మొత్తం ఎన్టీఆరే కనిపిస్తున్నాడు. ట్రైలర్లో హీరోయిన్లు కూడా ఇలా మెరిసి అలా మాయమయ్యారంతే. ఇక మిగతా పాత్రలపై ఎవరికీ ఆలోచనే లేదు. ఈ సినిమాలో విలన్ పాత్రలు, సహాయ పాత్రలు ఎవరు చేస్తున్నారన్న చర్చే లేదు. ఐతే ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ చేసిన మూడు పాత్రల తర్వాత సాయికుమార్‌ది అత్యంత కీలక పాత్ర అని సమాచారం. హీరోయిన్ల కంటే కూడా సాయికుమార్ కీలకం అని అంటున్నారు.

జై పాత్రకు రైట్ హ్యాండ్ లాగా సాయికుమార్ పాత్ర ఉంటుందని అంటున్నారు. ‘జై లవకుశ’కు సంబంధించి లేటెస్టుగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఎన్టీఆర్ పక్కన సాయికుమార్ కనిపిస్తాడు. ఈ సినిమా ట్రైలర్లో కూడా ఒక్క క్షణం మెరుపులా కనిపిస్తాడు సాయికుమార్. ఆయన ఎన్టీఆర్ గత సినిమా ‘జనతా గ్యారేజ్’లోనూ ఓ ముఖ్య పాత్ర చేశాడు. అప్పటి పరిచయంతో ఎన్టీఆర్ ‘జై లవకుశ’లో కీలక పాత్రకు సాయికుమార్‌ను తనే ఎంచుకున్నాడట.

మరి సినిమాలో ఈ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. ఆ పాత్ర ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి. ఇప్పటికే ఫస్ట్ కాపీతో రెడీ అయిన ‘జై లవకుశ’ గురువారమే సెన్సార్‌కు వెళ్తోంది. వచ్చే గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందన్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు