స్టార్‌ హీరో లేడీ గెటప్‌ సూపర్‌

స్టార్‌ హీరో లేడీ గెటప్‌ సూపర్‌

వైవిధ్యభరిత పాత్రలు పోషిస్తూ లో బడ్జెట్‌ చిత్రాలతోనే తమిళ చిత్ర సీమలో స్టార్‌ హీరోగా ఎదిగిన విజయ్‌ సేతుపతి తన తదుపరి చిత్రంలో లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడు. రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపించే విజయ్‌ సేతుపతి లేడీ గెటప్‌ వేయడమేంటని ఈ వార్త బయటకి వచ్చినపుడు అనుకున్నారు.

కానీ ఆ గెటప్‌లో విజయ్‌ ఫస్ట్‌లుక్‌ చూసిన వారు ఔరా అంటున్నారు. సూపర్‌ డీలక్స్‌ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో శిల్ప అనే లేడీ క్యారెక్టర్‌ చేస్తున్నాడు. విజయ్‌ సేతుపతి లేడీ గెటప్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిపోయింది. లేడీ గెటప్స్‌ అనేవి ఒకప్పుడు కామన్‌ అయినా ఈమధ్య బాగా తగ్గాయి. కానీ రీసెంట్‌గా తమిళ హీరోలు విక్రమ్‌, శివకార్తికేయన్‌ లేడీ గెటప్స్‌ వేసి ఆకట్టుకున్నారు.

ఇప్పుడు విజయ్‌ సేతుపతి తన వగలతో వయ్యారాలతో వెండితెరపై ఎంతగా మెరిసిపోతాడనేది చూడాలి. చిరంజీవి చేస్తోన్న చారిత్రిక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'తో విజయ్‌ సేతుపతి తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ చిత్రంలో తను చేసే పాత్ర వివరాలు సస్పెన్స్‌గా వుంచిన విజయ్‌ సేతుపతి ఈ చిత్రం తన కెరియర్లో ప్రత్యేకమైనది అవుతుందని, చిరంజీవితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం తన అదృష్టమని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు