మహానటిపై పులిహోర కలిపేసారట

మహానటిపై పులిహోర కలిపేసారట

సావిత్రిపై తీస్తోన్న బయోపిక్‌లో మహానటి పాత్ర పోషిస్తోన్న కీర్తి సురేష్‌ ఆ లుక్‌ బయటకి రాకుండా జాగ్రత్త పడుతోంది. ఈ చిత్రంపై తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లోను క్రేజ్‌ వుండడంతో కీర్తి లుక్‌ని కేర్‌ఫుల్‌గా కాపాడుకొస్తున్నారు. షూటింగ్‌ మొదలైన మొదటి రోజే కీర్తి ఫోటో ఒకటి లీకయింది.

అప్పట్నుంచీ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అలర్ట్‌ అయిపోయాడు. అయితే రెండ్రోజుల క్రితం కీర్తి సురేష్‌ పాత సినిమా హీరోయిన్‌ గెటప్‌లో వున్న ఫోటోలు కొన్ని నెట్‌లో దర్శనమిచ్చాయి. దీంతో ఇది 'మహానటి' లుక్‌ అంటూ ప్రచారం స్టార్ట్‌ అయింది. చాలా వెబ్‌సైట్లతో పాటు పేపర్లలో కూడా మహానటిలో కీర్తి సురేష్‌ అంటూ విస్తృతమైన కవరేజ్‌ దక్కిన ఆ ఫోటో ఇంతకీ అసలు ఆ సినిమాలోదే కాదట.

ఒక జ్యువలరీ బ్రాండ్‌ కోసమని కీర్తి సురేష్‌ చేసిన ఫోటోషూట్‌లోని ఫోటోలని బ్రాండ్‌ పేరు లేకుండా రిలీజ్‌ చేసేసరికి 'మహానటి'లోనే ఇలా కనిపిస్తుందని అనేసుకున్నారట. కీర్తి సురేష్‌ దీనిపై క్లారిటీ ఇచ్చేసి, మహానటి లుక్‌ బయటకి రావడానికి ఇంకా సమయం వుందని చెప్పింది. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ సినిమా వర్క్‌తో బిజీగా వున్న కీర్తి ఈ చిత్రంలో తన పార్ట్‌ పూర్తి చేసిన తర్వాత ఫుల్‌ టైమ్‌ మహానటికి కేటాయిస్తుందట. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ నాటికి విడుదలవుతుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు