ఆ సినిమాపై మినిమం బజ్‌ లేదు

ఆ సినిమాపై మినిమం బజ్‌ లేదు

సునీల్‌ హీరోగా నటించిన 'ఉంగరాల రాంబాబు' ఈ శుక్రవారం రిలీజ్‌ అవుతోంది. ఈ చిత్రంపై విడుదలకి ముందు ఎలాంటి ఆసక్తి లేదు. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ట్రెయిలర్‌ మరీ మూస సినిమా అనే భావన కలిగించింది. కామెడీ మానేసి హీరోయిజం మొదలుపెట్టిన సునీల్‌ ఈ సినిమాతో తిరిగి కామెడీకి షిఫ్ట్‌ అవుతున్నాడనే అనిపించాడు. కానీ ట్రెయిలర్‌ చూస్తే ఫక్తు కమర్షియల్‌ సినిమా ఛాయలు కనిపించాయి. కామెడీ వున్నా కానీ అది సునీల్‌ రేంజ్‌ది కాకపోవడంతో ట్రెయిలర్‌తో సినిమాపై ఆసక్తి పూర్తిగా సన్నగిల్లింది.

విడుదలకి చాలా సమయం తీసుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు శుక్రవారం రిలీజ్‌ అవుతోంది కానీ కేవలం ఆరు రోజుల వ్యవధి మాత్రమే వుంది. జై లవకుశ రిలీజ్‌ అయితే ఫోకస్‌ అంతా అటు షిఫ్ట్‌ అయిపోతుంది. ప్రీ రిలీజ్‌ బజ్‌ లేదు కనుక పబ్లిక్‌ టాక్‌ మీదే ఈ చిత్రం వసూళ్లు ఆధారపడతాయి. ఒకవేళ టాక్‌ బాగా వచ్చినా కానీ ఈ చిత్రం నిలదొక్కుకోవడానికి సమయం ఇవ్వని టైమ్‌లో రిలీజ్‌ అవుతోంది.

సునీల్‌ హీరోగా కొనసాగుతాడా లేదా అనేది ఉంగరాల రాంబాబు ఫలితంపై డిపెండ్‌ అవుతుంది. తనకి అంత కీలకమైన ఈ చిత్రానికి మినిమమ్‌ బజ్‌ తేవడంలో సునీల్‌ విఫలమయ్యాడు. ఇటీవల అల్లరి నరేష్‌ సినిమా 'మేడమీద అబ్బాయి'కి రిలీజ్‌కి ముందు సందడి లేక మిస్‌ఫైర్‌ అయింది. మరి సునీల్‌కి ఎలాంటి ఫలితం ఎదురవుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు