నో క‌ట్స్‌... అడ‌ల్ట్ ఫ్యామిలీ మూవీ అట‌

నో క‌ట్స్‌... అడ‌ల్ట్ ఫ్యామిలీ మూవీ అట‌

సీబీఎఫ్ సీ కొత్త ఛైర్మ‌న్ ప్ర‌సూన్ జోషీ ఎక్స్ జోన్ అనే సినిమాలో అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటూ ఆ సినిమాను నిషేధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో, సీబీఎఫ్ సీ మాజీ ఛైర్మ‌న్ ప‌హ్లాజ్ నిహ్లానీ బాట‌లోనే ప్ర‌సూన్ ప‌య‌నిస్తున్నాడ‌ని అంద‌రూ భావించారు. అయితే, అనూహ్యంగా జూలీ-2 అడ‌ల్ట్ మూవీకి ఒక్క క‌ట్ కూడా చెప్ప‌కుండా ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చి అంద‌రికీ షాక్ ఇచ్చాడు ప్ర‌సూన్‌. కొద్ది రోజుల క్రితం విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ లో రాయ్ ల‌క్ష్మీ త‌న అందాల‌ను ఆర‌బోసింది. అటువంటి సినిమాకు ఒక్క క‌ట్ కూడా లేకుండా ఏ స‌ర్టిఫికెట్ ల‌భించ‌డం ఏమిట‌ని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

అయితే, ఈ వ్య‌వ‌హారం వెనుక సీబీఎఫ్ సీ మాజీ ఛైర్మ‌న్ ప‌హ్లాజ్ నిహ్లానీ పేరు బ‌లంగా వినిపిస్తోంది. చైర్మ‌న్ ప‌దవి నుంచి వైదొలిగాక ప‌హ్లాజ్... జూలీ -2 సినిమాకు డిస్ట్రిబ్యూట‌ర్ అవ‌తార‌మెత్తాడు. అందువ‌ల్లే ఈ సినిమాకు ఒక్క క‌ట్ కూడా ప‌డ‌కుండా ప్ర‌సూన్ ను ప్ర‌భావితం చేశాడ‌ని అనుకుంటున్నారు.

అయితే, ఈ వ్య‌వ‌హారం పై పహ్లాజ్ వివ‌ర‌ణ వేరే విధంగా ఉంది. ఒక వేళ తాను సీబీఎఫ్ సీ ఛైర్మ‌న్ గా ఉన్నా కూడా జూలీ సినిమాకు ఒక్క క‌ట్ కూడా చెప్ప‌కుండా ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చేవాడిన‌ని ప‌హ్లాజ్ మీడియాకు తెలిపాడు.  

'' ఈ సినిమాలో డ‌బుల్ మీనింగ్ డైలాగులు,  న్యూడిటీ, స్కిన్ షో వంటివి లేవు. ఇది అడ‌ల్ట్స్ కోసం తీసిన కుటుంబ క‌థా చిత్రం. నేను ఇప్పుడు సీబీఎఫ్ సీ ఛైర్మ‌న్ కాదు. నేను సినిమా డిస్ట్రిబ్యూట‌ర్ ని. నాకు తెలిసింద‌ల్లా సినిమా..సినిమా...సినిమా  '' అంటూ ప‌హ్లానీ వివర‌ణ ఇచ్చాడు.  ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్ట‌డం అంటే ఇదేన‌ని ప‌లువురు సినీ విశ్లేష‌కులు ప‌హ్లానీని విమ‌ర్శిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు