ఎన్ని మిలియన్లు కావాలి మహేష్..

ఎన్ని మిలియన్లు కావాలి మహేష్..

తెలుగు సినిమాలు అమెరికాలో 200 స్క్రీన్లలో రిలీజైతే గొప్పగా చెప్పుకుంటుంటాం. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ల సినిమాలు ఆ నంబర్ కూడా దాటేస్తుంటాయి. ఐతే బాహుబలి మినహాయిస్తే మరే తెలుగు సినిమా కూడా 250 స్క్రీన్లకు మించి విడుదలైన దాఖలాలు లేవు.

ఐతే మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’ మాత్రం అమెరికాలో ఏకంగా 400 స్క్రీన్లలో విడుదల కాబోతోంది. మహేష్-మురుగ కాంబినేషన్‌కున్న క్రేజ్‌కు తోడు.. ద్విభాషా చిత్రం కావడం దీనికి కలిసొచ్చే అంశం. రెండు భాషల్లో కలిపి ఏకంగా 400 లొకేషన్లలో సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత అత్యధిక స్క్రీన్లు దక్కించుకున్న సౌత్ ఇండియన్ మూవీ ‘స్పైడర్’ అని అంటున్నారు. ఇన్ని లొకేషన్లలోనూ ప్రిమియర్ షోలు పడ్డాయంటే కలెక్షన్లు ఏ రేంజిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రిమియర్లతోనే ఈజీగా 2 మిలియన్లు వచ్చి పడిపోతాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ఈజీగా 5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసే అవకాశముంది. మహేష్ సినిమాల్లో ఇప్పటిదాకా ‘శ్రీమంతుడు’ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించింది. ఆ చిత్రం 2.87 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

‘స్పైడర్’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వసూళ్లు డబులయ్యే అవకాశాలుంటాయి. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా 3-4 మిలియన్ల మధ్య వసూళ్లు గ్యారెంటీనేమో. ‘ఫిదా’.. ‘అర్జున్ రెడ్డి’ లాంటి చిన్న సినిమాలే వందకు అటు ఇటుగా స్క్రీన్లలో రిలీజై 2 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరుతుంటే.. మహేష్ సినిమాను అంత పెద్ద స్థాయిలో విడుదల చేస్తే.. ఆ మాత్రం వసూళ్లు రావా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు