రాశీ ఖన్నా.. తారక్ ఫ్యాన్ ఎప్పుడైంది?

రాశీ ఖన్నా.. తారక్ ఫ్యాన్ ఎప్పుడైంది?

నిన్నజరిగిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రం జై లవకుశ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో రాశీ ఖన్నా తన నాభి అందాలతో అభిమానుల మతులు పోగొట్టింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అని, యాక్టింగ్ లోనూ తన బెస్ట్ అని పొగడ్తలు కురిపిస్తోందండీ.

అంతేకాదు తారక్ అభిమానిగా మారిపోయానంటూ తెగ మెచ్చుకుంటోంది. సినిమాలో నటించకముందే తారక్ చాలా గొప్ప నటుడిని తెలుసుకుందంట. ఇప్పడు జై లవకుశలో నటించడం ద్వారా ఆయన అద్భుతమైన ప్రతిభ ఉన్ననటుడని వయ్యారాలు పోతోంది.

ఇక తారక్ డ్యాన్స్, నటన గురించి చెప్పాల్సిన పని లేదని ఆయన బెస్ట్ అని అందరికీ తెలుసంటోంది. సినిమాలో మూడు పాత్రలు అదేనండీ జై, లవ, కుశ మూడింటిలోనూ తారక్ దేనికదే భిన్నంగా, అద్భుతంగా చేశాడంటోంది.

ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడని, ఆయనతో కలిసి నటించడం ద్వారా ఎన్నో నేర్చుకున్నానని అంటోంది ఈ బొద్దుగుమ్మ. పనిలో పనిగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను, సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడులను కూడా ఒక రేంజ్ లో పొగిడింది. నివేథా థామస్ మీకు నచ్చిందా అని ఫ్రేక్షకులను అడిగి వారిని కవ్వించిందీ సుందరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు