రిలీజ్‌కి ముందు వదిలేస్తే కృష్ణార్పణం

రిలీజ్‌కి ముందు వదిలేస్తే కృష్ణార్పణం

విడుదలకి ముందు ప్రమోషన్‌ పరంగా కేర్‌ తీసుకోకపోతే ఏమవుతుందనే దానికి 'యుద్ధం శరణం', 'మేడ మీద అబ్బాయి' ఫలితాలే ఉదాహరణగా నిలుస్తాయి. ఈ రెండు చిత్రాలకీ విడుదలకి ముందు బజ్‌ తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. మినిమం గ్యారెంటీ హీరోగా మారుతోన్న చైతన్య చిత్రానికి కూడా నామమాత్రపు ఓపెనింగ్స్‌ రాలేదంటే పబ్లిసిటీ ఎంత వీక్‌గా వుందో, అది ఎంత ఎఫెక్ట్‌ చేసిందో తెలుస్తుంది. అల్లరి నరేష్‌కి అయితే మునుపటి క్రేజ్‌ లేదు.

వరుస పరాజయాల్లో వున్న అతను ఈ చిత్రాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో తెలుసుకోలేకపోయాడు. ఫలితంగా మేడ మీద అబ్బాయి చెట్టెక్కేసాడు. విడుదలకి ముందు ఎంత హైప్‌ తీసుకురాగలిగితే, ఎంతగా ఈ సినిమా చూడాలనే ఆసక్తి కలిగించగలిగితే అంత బెనిఫిట్‌ వుంటుంది.

అర్జున్‌రెడ్డి, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలకి ప్రీ రిలీజ్‌ బజ్‌ ఎంత హెల్ప్‌ అయిందనేది తెలిసిందే. రారండోయ్‌ వేడుక చూద్దాంని కూడా నాగార్జున చాలా అగ్రెసివ్‌గా ప్రమోట్‌ చేసారు. కానీ యుద్ధం శరణం చిత్రానికి సరైన మార్కెటింగ్‌ జరగలేదు. అసలు ఇలాంటి ఒక సినిమా వస్తోందనే ఇన్‌ఫర్మేషన్‌ రిజిష్టర్‌ చేయడంలోను టీమ్‌ విఫలమయ్యారు.

దీంతో ఈ రెండు సినిమాలు మొదటి రోజే డిజాస్టర్లుగా ముద్ర పడిపోయి, రెండవ రోజు నుంచి మరింత దారుణమైన వసూళ్లతో రన్‌ అవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు