మహేష్‌ బాబుని మోసం చేస్తున్నాడా?

మహేష్‌ బాబుని మోసం చేస్తున్నాడా?

మహేష్‌బాబుకి 'స్పైడర్‌'తో తమిళనాట మార్కెట్‌ ఏర్పడుతుందని అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే స్పైడర్‌ చిత్రం తమిళ హక్కులని మంచి రేటుకి తీసుకోవడంతో పాటు బాగా ప్రమోట్‌ కూడా చేస్తున్నారు. అయితే ప్రధానంగా మహేష్‌ సినిమా అంటే తెలుగు చిత్రంగానే ట్రీట్‌ చేయాలి. మహేష్‌ మార్కెట్‌ ఇక్కడ వంద కోట్లుంటే తమిళంలో ఇరవై కూడా లేదింకా. అయినా కానీ తెలుగు వెర్షన్‌ని సైడ్‌లైన్‌ చేస్తూ మురుగదాస్‌ తెలివిగా తమిళ వెర్షన్‌ని బాగా మార్కెట్‌ చేసుకుంటున్నాడు. ఈ చిత్రానికి మురుగదాస్‌ రెమ్యూనరేషన్‌గా తమిళ హక్కులు ఇచ్చేసారని గాసిప్స్‌ వున్నాయి.

తెలుగు సినిమాకి తెలుగులో పాటలు చేయించుకోకుండా, తమిళంలో ట్యూన్లు చేయించి, సాహిత్యం రాయించి, వాటికి అనువాదాన్ని రామజోగయ్య శాస్త్రితో రాయించారు. ఆయనేమో ఆ ట్యూన్లకి ఏమి రాయాలో తెలియక 'పుచ్చకాయ పుచ్చకాయ పెదవి తీపి నీకిచ్చుకోనా ఇచ్చుకోనా' అంటూ ఏదేదో రాసేసాడు. ఇందులో విలన్‌గా ఎస్‌జె సూర్యని పెట్టుకున్నారు. అతనికి తమిళంలో హీరో ఇమేజ్‌ వుంది కానీ తెలుగు వెర్షన్‌ వరకు ఎలాంటి వేల్యూ తీసుకురాడు.

ఆడియో వేడుక కూడా తమిళనాడులోనే ఘనంగా చేయించి, అక్కడే తెలుగు పాటలు కూడా విడుదల చేసేసారు. తెలుగులో మరో వేడుక చేస్తామని ప్రకటించారు. వంద కోట్ల మార్కెట్‌ ఆధారపడి వున్న మార్కెట్‌ మీద ఇంత శీతకన్నేల? మహేష్‌ వీరుడు, శూరుడు అంటూ పొగడ్తలతో ముంచేస్తోన్న మురుగదాస్‌ సైలెంట్‌గా తన తమిళ వెర్షన్‌ని ఎక్కువ మార్కెట్‌ చేసుకుంటున్నాడని, మహేష్‌ని మాయ చేసి ఆడిస్తున్నాడని కామెంట్లు పడుతున్నాయి.

జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే ఈ కామెంట్లని తీసి పారేయడానికి కూడా లేదు. తమిళ వెర్షన్‌ని కూడా ప్రమోట్‌ చేయాల్సిందే కానీ తెలుగుని మించి దానికి ఇంపార్టెన్స్‌ ఇవ్వడం ఎంతవరకు సబబు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు