వాట్సాప్ న్యూ ఫీచర్.. స్పెషల్ గా డిలీట్ చేయక్కర్లేదు..!

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా.. మరో అద్భుతమైన ఫీచర్ ని తీసుకువస్తోంది.

ఇప్పటి వరకు మనం వాట్సాప్ లో ఎవరితోనైనా ఛాటింగ్ చేసిన తర్వాత.. ఆ మెసేజ్ లు వద్దు అనుకుంటూ.. ఒక్కో మెసేజ్ అయినా చదవాలి. లేదంటే.. అన్నీ కలిపి ఒకేసారి డిలీట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. అయితే ఇక నుంచి స్పెషల్ గా మెసేజ్ లు డిలీట్ చేయాల్సిన పనిలేదు. దాని కోసమే స్పెషల్లీ ఒక ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తోంది.

మెసేజ్‌లను డిలీట్ చేసుకునే అవసరం లేకుండా చూడగానే వాటికవే డిలీట్ అయ్యేలా ‘వ్యూ వన్స్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇప్పటికి ఈ ఫీచర్ స్నాప్‌చాట్‌ సహా కొన్ని ప్లాట్‌ఫాంల్లో అందుబాటులో ఉంది.

కాగా వాట్సాప్‌లో చాట్ అనంతరం మెసేజ్లు డిలీట్ చేసుకోవడం కష్టమవుతుందనే ఫిర్యాదు యూజర్ల నుంచి ఎప్పటి నుంచో వస్తోంది. ఈ డిమాండ్ ఆధారంగానే తాజా ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ ఫీచర్‌ను కంప్లీట్ గా కాకుండా మనకు ఏ కాంటాక్ట్ కి అవసరమైతే.. వారికి పెట్టుకునే వీలు ఉంటుంది. మనం ఎవరి మెసేజ్ లు అయితే.. డిలీట్ చేయాలి అనుకుంటామో.. వారికి ఈ ఫీచర్ పెట్టుకుంటే సరిపోతుంది. బిజినెస్ యూజర్లు ఈ న్యూ ఫీచర్ ఎంతో ఉపయోగకరం కానుంది.