ఎన్టీఆర్ను ఇబ్బంది పెట్టిన 'జై లవకుశ'

ఎన్టీఆర్ను ఇబ్బంది పెట్టిన 'జై లవకుశ'

90ల్లో జగపతిబాబు హీరోగా ‘శుభాకాంక్షలు’ అనే సినిమా వచ్చింది. అందులో ఒక పాట కోసం జగపతి 50కి పైగా డ్రెస్సులు మార్చాడు. దాని గురించి అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. ఐతే ఇప్పుడు ‘జై లవకుశ’ కోసం ఎన్టీఆర్ ఏకంగా ఒక రోజు 79 డ్రెస్సుల దాకా మార్చాడట. ఐతే అది సరదాగా పాట కోసం కాదు. ఈ సినిమాలోని వీఎఫెక్స్ షాట్ల కోసమట.

ఇప్పటిదాకా కెరీర్లో ఏ సినిమా సందర్భంగా.. ఏ సీన్ విషయంలోనూ కష్టంగా అనిపించని తనకు ఈ డ్రెస్సులు మారుస్తున్నపుడు మాత్రం ఇబ్బందిగా అనిపించిందని.. ఇంత కష్టం అవసరమా అనిపించిందని ఎన్టీఆర్ చెప్పాడు. ఈ డ్రెస్సులు మార్చే విషయం ఎన్టీఆర్ పడ్డ ఇబ్బంది గురించి రచయిత కోన వెంకట్, హీరోయిన్ నివేదా థామస్ కూడా ప్రస్తావించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ చూపించిన ఓపిక, కమిట్మెంట్ అద్భుతమని అన్నారు.

‘జై లవకుశ’లో 36 దాకా వీఎఫెక్స్ షాట్లు ఉంటాయట. ఐతే ఈ సినిమాలో తాను మూడు పాత్రలు చేయడంతో ఈ షాట్ల కోసం మూడు పాత్రలు మళ్లీ మళ్లీ డ్సెస్సులు మార్చి కనిపించాల్సి వచ్చిందని.. ఇలా పదే పదే డ్రెస్సలు మార్చి నటించాల్సి రావడంతో ఫ్రస్టేట్ అయ్యానని.. ఇంత కష్టం అవసరమా అనిపించిందని.. కానీ ఒక మంచి సినిమా కోసం.. అభిమానుల కోసం ఇలాంటివి తప్పదని సర్దుకున్నానని ఎన్టీఆర్ తెలిపాడు.

మామూలుగానే త్రిపాత్రాభినయం అంటే చాలా కష్టముంటుంది. పైగా ‘జై లవకుశ’ను ఆరు నెలల్లోనేు పూర్తి చేసేశారు. మధ్యలో ‘బిగ్ బాస్’ షో కోసం షూటింగ్‌లో పాల్గొన్నాడు తారక్. దీన్ని బట్టి గత ఆరు నెలల్లో అతను ఎంతగా కష్టపడి ఉంటాడో అంచనా వేయొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు