బిగ్ బాస్ లో దించ‌క్ పూజ‌?

బిగ్ బాస్ లో దించ‌క్ పూజ‌?

హిందీ బిగ్ బాస్ త‌ర‌హాలోనే త‌మిళ, తెలుగు భాష‌ల‌లో ఈ షోను ప్రారంభించారు నిర్వాహ‌కులు. క‌మ‌ల హాస‌న్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న త‌మిళ బిగ్ బాస్ కు పెద్ద‌గా క్రేజ్ రాలేదు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌ల్ల‌ తెలుగు బిగ్ బాస్ షోకు రేటింగ్స్ బాగానే వ‌స్తున్నాయి. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ -2 కోసం కంటెస్టెంట్ల వేట మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు, ఇప్ప‌టికే 10 సీజ‌న్లు పూర్తి చేసుకున్న హిందీ బిగ్ బాస్ 11 వ సీజ‌న్ అక్టోబ‌ర్ 1 నుంచి ప్రారంభం కానుంది. బిగ్ బాస్ 11 కు సంబంధించిన మొద‌టి టీజ‌ర్ ను కొద్ది రోజుల క్రితం విడుద‌ల చేశారు. ప‌డోసీ(ఇరుగు పొరుగు వాళ్లు )ల‌తో ఎలా మెల‌గాలో తెలియజేసే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ 11 ను రూపొందించారు. బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ మరోసారి ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు.

హిందీ బిగ్ బాస్ షో-11 లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి ఇపుడు చ‌ర్చ న‌డుస్తోంది. యంగ్‌ యాక్టర్స్ తో పాటు కొంత‌మంది సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీలు కూడా ఈ సారి షోల‌కు ర‌చ్చ చేయ‌బోతున్నార‌ట‌. త‌న క‌ర్ణ‌క‌ఠోర‌మైన గొంతుతో సోష‌ల్ మీడియాను కుదిపేసిన‌ దించక్‌ పూజ ను బిగ్ బాస్ను-11 కు ఎంపిక చేశార‌ట‌. టెలివిజ‌న్ ఆర్టిస్ట్ లు నియా శర్మ, నీతీ టేలర్‌, పరల్‌ వీ పూరి, సినీ నటుడు నికితిన్‌ ధీర్‌, భోజ్‌పూరి నటి రాణి చటర్జీ కూడా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ట‌. టీవీ నటి ప్రత్యూష బెనర్జీ మృతి కేసులో నిందితుడిగా ఉన్న రాహుల్‌ రాజ్‌ సింగ్ కూడా ఈ షోలో పాల్గొనే అవ‌కాశముంది. ఈ కాంబినేష‌న్ ఓకే అయితే, గ‌తంలో మాదిరిగానే బిగ్ బాస్ -11 లో కూడా కాంట్ర‌వ‌ర్సీలకు కొద‌వుండ‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు