నాగచైతన్యకి మేకు కొట్టేసారు

నాగచైతన్యకి మేకు కొట్టేసారు

నాగచైతన్య రేంజ్‌ పెంచడానికి నాగార్జున చేసిన ప్రయత్నం ఫలించలేదు. నాని, శర్వానంద్‌ లాంటి హీరోలు దూసుకుపోతూ వుండగా, నాగచైతన్య రేంజ్‌ మాత్రం ఒక పరిధి దాటి పెరగడం లేదు. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' హిట్‌ అయినా కానీ చైతన్య తదుపరి చిత్రానికి కూడా బిజినెస్‌ అంతంత మాత్రం జరిగింది. హీరోగా తన మార్కెట్‌ మేకు కొట్టినట్టు ముందుకి కదలకపోవడం మాత్రం ఫాన్స్‌ని ఇబ్బంది పెడుతోంది. నిన్న కాక మొన్న వచ్చిన హీరోలు కూడా ప్రతి సినిమాతోను ఇంప్రూవ్‌ అవుతున్నారు.

విజయ్‌ దేవరకొండ, వరుణ్‌ తేజ్‌ కూడా సోలోగా బ్లాక్‌బస్టర్లు కొట్టేసారు. కానీ చైతన్యకి మాత్రం ఇంతవరకు ఆ బ్లాక్‌బస్టర్‌ కల తీరలేదు. రాజమౌళి ఎంత ప్రచారం చేసినా కానీ 'యుద్ధం శరణం' మీద బజ్‌ అయితే అంతగా లేదు. దీంతో విడుదలకి ముందే ఈ చిత్రం ప్రచారం కోసం చైతన్య ఊర్లు పట్టుకుని తిరుగుతున్నాడు. యువతని ఆకట్టుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.

ఈసారి అయినా చైతన్య కోరుకుంటోన్న ఘన విజయం దక్కుతుందా లేదా అనేది చూడాలి. పైసా వసూల్‌ ఫ్లాప్‌ అవడం వల్ల ఈ వారాంతంలో నాగచైతన్య చిత్రానికి ఫుల్‌గా క్యాష్‌ చేసుకునే వీలుంది. టాక్‌ బాగా తెచ్చుకుంటే వీకెండ్‌కి మంచి నంబర్లు చూడవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు