'అర్జున్ రెడ్డి ' పాఠం నేర్పింది: విజ‌య్‌

'అర్జున్ రెడ్డి ' పాఠం నేర్పింది: విజ‌య్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో  'అర్జున్ రెడ్డి ' హ‌వా న‌డుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోను ఈ సినిమా క‌లెక్ష‌న్ల సునామీ రేపుతోంది. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. విజ‌య్ న‌ట‌న‌పై విమ‌ర్శ‌కులు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఈ సినిమాతో తాను అనేక విష‌యాలు నేర్చుకున్నాన‌ని విజ‌య్ చెప్పాడు. ఈ సినిమా త‌న‌కు కేవలం ఒక విజ‌యాన్ని మాత్ర‌మే కాకుండా, ఒక పాఠాన్ని కూడా నేర్పింద‌న్నాడు. ఈ సినిమా చేసిన త‌ర్వాత తాను ఎలా వుండాలనుకుంటున్నానో అలాగే ఉండాలనీ, మొహమాటాలకు పోకూడదని నిర్ణయించుకున్నానని అన్నాడు.

ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా విజ‌య్ త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను వెల్ల‌డించాడు. మ‌న‌కు ఏదైనా విష‌యం న‌చ్చ‌క‌పోతే నిర్మొహ‌మాటంగా చెప్పేయ‌డం మంచిద‌ని విజ‌య్ అన్నాడు. మ‌న సహ‌జ శైలికి భిన్నంగా మొహ‌మాటాల‌కు పోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు ప‌డ‌తామ‌ని చెప్పాడు. త‌న‌కు కథ నచ్చకపోతే నచ్చలేదని చెబుతాననీ, డేట్స్ లేవనీ .. సర్దుబాటు కావడం లేదని సాకులు చెప్పనని స్పష్టం చేశాడు.

రియలిస్టిక్ గా వుండే క్యారెక్ట‌ర్స్ తనకు సూట్ అవుతాయ‌ని, త‌న నుంచి అటువంటి పాత్రలనే ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నార‌ని  చెప్పాడు. తాను న‌టించిన పాత్రలో ప్రతి ఒక్కరూ తమని తాము చూసుకోగలిగినప్పుడే ఆ పాత్ర వారికి కనెక్ట్ అయినట్ల‌ని విజ‌య్ అన్నాడు.  'అర్జున్ రెడ్డి' విషయంలో కూడా అదే జరిగిందన్నాడు. మ‌రి అర్జున్ రెడ్డి త‌ర్వాత వ‌చ్చే సినిమాల‌లో విజ‌య్ ఎటువంటి పాత్ర‌లు పోషిస్తాడో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు