మరుగున పడ్డ సినిమాను బయటికి తీశారు

మరుగున పడ్డ సినిమాను బయటికి తీశారు

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయిత మాత్రమే కాదు.. దర్శకుడు కూడా. ఆయన 'శ్రీకృష్ణ 2006'తో పాటు అక్కినేని నాగార్జునతో 'రాజన్న' అనే భారీ సినిమాను కూడా తెరకెక్కించారు. తన రెండో సినిమాతో ఆయన చాలా గ్యాప్ తీసుకుని గత ఏడాది 'శ్రీవల్లీ' అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించారు.

అందరూ కొత్తవాళ్లే నటించిన ఈ సినిమాను కొత్త నిర్మాతలు ప్రొడ్యూస్ చేశారు. ఐతే ఈ సినిమా గత ఏడాదే పూర్తయినప్పటికీ విడుదలకు నోచుకోవట్లేదు. 'బాహుబలి: ది కంక్లూజన్' విడుదలై విజయేంద్ర ప్రసాద్ పేరు వార్తల్లో నిలిచాక.. ఆ ఊపులో 'శ్రీవల్లీ'ని రిలీజ్ చేస్తే హైప్ వస్తుందనుకున్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు.

కొన్ని నెలలుగా ఊసే లేని 'శ్రీవల్లీ' ఎట్టకేలకు మళ్లీ ఎట్టకేలకు వార్తల్లోకి వచ్చింది. ఈ చిత్రాన్ని ఇంకో పది రోజుల్లోనే విడుదల చేస్తారట. సెప్టెంబరు 15న ఇటు తెలుగులో.. అటు కన్నడలో ఒకేసారి 'శ్రీవల్లీ' ప్రేక్షకుల ముందుకొస్తుందని ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని టీజర్.. ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. ఐతే ప్రోమోలు చూస్తే సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది మాత్రం అర్థం కాలేదు.

మరి సినిమా ఏమాత్రం క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ తనయుడు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి కూడా రాజమౌళి రెడీ అవుతున్నాడు. 'బాహుబలి' హీరో ప్రభాస్ ఆల్రెడీ ఈ సినిమా ప్రమోషన్ కోసం బైట్ ఇచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు