రజినీ సాయం కోరుతున్న షారుఖ్

రజినీ సాయం కోరుతున్న షారుఖ్

పాపం షారుఖ్ ఖాన్. బాలీవుడ్లో అతడి పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం బాగా లేదు. ఒకప్పుడు హిందీ సినిమాల్ని ఏలి.. ‘కింగ్ ఖాన్’.. ‘బాద్ షా’ అన్న పేర్లతో పిలిపించుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పడు డిజాస్టర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. గత కొన్నేళ్లలో వరుస ఫ్లాపులతో బాగా వెనుకబడిపోయాడు షారుఖ్. అతడి తాజా సినిమా ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ కూడా పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో షారుఖ్ ఖాన్ మార్కెట్ బాగా దెబ్బ తినేసి.. అతడి భవిష్యత్తే అగమ్య గోచరంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో తనకు హిట్టిచ్చే దర్శకుడెవరా అని చూస్తున్నాడు షారుఖ్. అతను ప్రస్తుతం కబీర్ ఖాన్ ను నమ్ముకున్నట్లు సమాచారం.

సల్మాన్ ఖాన్‌తో ‘భజరంగి భాయిజాన్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కబీర్ ఖాన్.. ఈ మధ్యే అదే హీరోతో ‘ట్యూబ్ లైట్’ లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. అయినప్పటికీ షారుఖ్ అతడితో జట్టు కట్టబోతుండటం విశేషం. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘సిద్వాత్’ అనే సినిమా రాబోతోంది. షారుఖే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుందట. ఇంతకుముందు షారుఖ్-దీపిక కాంబినేషన్లో ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఆ చిత్రంలో లుంగీ డ్యాన్స్ పాటలో రజినీ నామ జపం చేశాడు షారుఖ్. ఆ సెంటిమెంటును దృష్టిలో పెట్టుకుని.. ‘సిద్వాత్’లో రజినీతో ఓ అతిథి పాత్ర చేయించాలని చూస్తున్నాడట. అంతే కాక సల్మాన్ ఖాన్ కోసం కూడా ఇందులో ఓ అతిథి పాత్ర పెడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇందులో ప్రభాస్ కూడా క్యామియో చేస్తాడన్న ఊహాగానాలు నడుస్తున్నాయి. ఐతే ప్రభాస్ సంగతేమో కానీ.. సల్మాన్, రజినీ మాత్రం ఈ చిత్రంలో నటించడం ఖాయమంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు