మహేష్ కత్తిని పంపించేశారుగా..

మహేష్ కత్తిని పంపించేశారుగా..

‘బిగ్ బాస్’ షో నుంచి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయాడు. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అతి తక్కువ పాపులారిటీతో వెళ్లిన మహేష్ కత్తి.. నాలుగో వారాంతంలో షో నుంచి బయటికి వచ్చాడు. ఈ వారం ఇద్దరు పార్టిసిపెంట్లు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. ముందుగా మహేష్ కత్తి బయటికి వచ్చాడు. ఆదివారం మరొకరు షో నుంచి బయటికి రాబోతున్నారు. మహేష్ కత్తి తొలి వారంలోనే షో నుంచి ఎలిమినేట్ కావాల్సిన వాడు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లిస్టులో ఆయన పేరు కూడా ఉంది. కానీ ఆ వారం జ్యోతి ఔట్ అయిపోవడంతో సేఫ్ అయిపోయాడు. కానీ ఈ వారం మాత్రం బయటికి రాక తప్పలేదు.

స్వతహాగా విమర్శకుడైన కత్తి మహేష్ హౌస్ నుంచి బయటికి వచ్చాక లోపలున్న ఒక్కొక్కరి గురించి చక్కటి విశ్లేషణ చేశాడు. ధన్ రాజ్ డబుల్ గేమ్ ఆడుతున్నాడని.. ఆదర్శ్ కూడా అతి చేస్తున్నాడని అన్నాడు. ముమైత్ ఖాన్‌ను రాక్షసి అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఆమె అతడికి ఐలవ్యూ చెప్పగా.. తిరిగి లవ్ యూ టూ అన్నాడు. షో నుంచి బయటికి వచ్చేవాళ్లు లోపలున్న వాళ్లలో ఒకరికి పనిష్మెంట్ ఇచ్చే అవకాశముంది. కత్తి మహేష్.. ఆదర్శ్‌కు ఆ పనిష్మెంట్ ఇచ్చాడు. అతను వారం రోజుల పాటు సహచరులందరి ప్లేట్లు కడగాలని పనిష్మెంట్ ఇచ్చాడు కత్తి. ఆదివారం ఎలిమినేషన్ లిస్టులో హరితేజ.. కల్పన ఉన్నారు. వీరిలో ఎవరు బయటికి వస్తారో చూడాలి. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హీరో నవదీప్ లోపలికి వస్తాడని ప్రచారం జరుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు