అర్జున్ రెడ్డీ.. పండగ చేస్కోవయ్యా!

అర్జున్ రెడ్డీ.. పండగ చేస్కోవయ్యా!

ఈ నెలలో రెండు వారాల్లో ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. తొలి వారంలో.. ‘నక్షత్రం’.. ‘దర్శకుడు’ విడుదలైతే.. ఈ శుక్రవారం ఒకే రోజు మూడు సినిమాలు (నేనే రాజు నేనే మంత్రి, లై, జయ జానకి నాయక) విడుదలయ్యాయి. వచ్చే వారానికి ‘ఆనందో బ్రహ్మ’, ‘వీఐపీ-2’ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఈ సినిమాలపై పెద్దగా అంచనాల్లేవు కానీ.. తర్వాతి వారం రావాల్సిన రెండు సినిమాల మీద ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి.

అందులో ఒకటి నాగచైతన్య సినిమా ‘యుద్ధం శరణం’ కాగా.. ఇంకోటి విజయ్ దేవరకొండ మూవీ ‘అర్జున్ రెడ్డి’. ఈ రెండింటి మీదా అంచనాలు బాగానే ఉండటంతో ఆసక్తికర బాక్సాఫీస్ పోరు చూడబోతున్నామని అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు కథ మారింది. ‘యుద్ధం శరణం’ వాయిదా పడిపోయింది. కారణాలేంటో తెలియదు కానీ.. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 8కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆగస్టు చివరి వారంలో ‘అర్జున్ రెడ్డి’ సోలో బ్యాటింగ్‌తో పండగ చేసుకోవచ్చన్నమాట. ఇది చిన్న సినిమాగా మొదలైనప్పటికీ.. దీనిపై అంచనాలు తక్కువగా ఏమీ లేదు.

సెన్సేషనల్ టీజర్, ట్రైలర్లతో యూత్ ఆడియన్స్‌లో ఈ సినిమా క్యూరియాసిటీ బాగా పెంచింది. ఈ సినిమాకు ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 25న ‘అర్జున్ రెడ్డి’ విడుదలవుతుండగా.. ముందు రోజు తమిళ డబ్బింగ్ మూవీ ‘వివేకం’ రిలీజవుతుంది. దాని వల్ల ‘అర్జున్ రెడ్డి’కి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు