వినాయ‌క్‌తో సినిమా.. సంబరపడనక్కర్లేదు

వినాయ‌క్‌తో సినిమా.. సంబరపడనక్కర్లేదు

సాయిధరమ్ తేజ్ మీడియం రేంజి హీరో. వి.వి.వినాయక్ ఏమో స్టార్ డైరెక్టర్. అందులోనూ ఆయన చివరగా తీసిన సినిమా రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఈ యాంగిల్లో చూస్తే వినాయక్‌తో పని చేయడం తేజుకు చాలా పెద్ద అవకాశంగానే భావించాలి. కానీ అతనేమీ సంబరపడిపోవాడానికి లేదు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే వినాయక్‌తో పనిచేయడాన్ని పెద్ద అవకాశంగా భావించే పరిస్థితి లేదు. ఎందుకంటే గత కొన్నేళ్లలో తెలుగు సినిమా చాలా మారింది. ప్రేక్షకుల అభిరుచితో పాటు దర్శకుల దృక్పథం కూడా మారింది. ఒకప్పట్లా రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీస్తే జనాలు చూడట్లేదు. వైవిధ్యం కోరుకుంటున్నారు.

ఈ ట్రెండుకు తగ్గట్లుగా వినాయక్ సినిమా తీయగలడా అంటే సందేహమే. ‘ఖైదీ నంబర్ 150’ బ్లాక్ బస్టర్ అయింది కానీ.. దాని క్రెడిట్ వినాయక్‌కు పెద్దగా దక్కలేదు. చిరంజీవి రీఎంట్రీ అనే అంశం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. పైగా అది రీమేక్ మూవీ. కాబట్టి వినాయక్ దీని ద్వారా తెచ్చుకున్న పేరేమీ లేదు. ఇక వినాయక్ దీనికి ముందు తీసిన ‘అఖిల్’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. వినాయక్ ప్రస్తుత ట్రెండుకు తగ్గట్లు అప్ డేట్ కాలేదనడానికి ఆ సినిమా రుజువుగా నిలిచింది. తేజుతో కూడా వినాయక్ వైవిధ్యమైన సినిమా తీస్తాడని ఆశలు పెట్టుకోలేం. ఎందుకంటే అతడితో రొటీన్ సినిమాలు చేసిన ఆకుల శివే ఈ చిత్రానికి కూడా స్క్రిప్టు అందించాడు. కాబట్టి వినాయక్ నుంచి మళ్లీ ఓ మసాలా సినిమానే చూడబోతున్నామన్నమాట. మరి వినాయక్ సినిమా ద్వారా తేజు ఏం లాభం పొందుతాడన్నది ఇప్పుడే చెప్పలేం. వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో పని చేస్తున్నాడు.. పెద్ద మాస్ హీరోఅయిపోతాడు.. తన కెరీర్ మరో స్థాయికి వెళ్లిపోతుందని ఇప్పుడే అంచనాలు కట్టేయడం కరెక్ట్ కాదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు