బురద జల్లుడు షురూ చేసారు

బురద జల్లుడు షురూ చేసారు

మూడు సినిమాలు పోటీ పడడం, మూడిటికి మూడూ జనం దృష్టిలో ఒకే రేంజ్‌వి కావడంతో క్లీన్‌ కాంపిటీషన్‌కి తావులేదు. నాలుగు రోజుల సెలవుల అడ్వాంటేజ్‌ సాధించాలంటే మొదటి రోజు ఖచ్చితంగా మంచి టాక్‌ తెచ్చుకుని తీరాలి. మౌత్‌ పబ్లిసిటీ పరంగా సోషల్‌ మీడియాది, వెబ్‌ మీడియాది కీలక పాత్ర కావడంతో ఆ పరంగా ప్రభావితం చేయడానికి పావులు కదులుతున్నాయి.

ఇప్పటికే ఇండస్ట్రీలో ఫలానా సినిమా బ్యాడ్‌గా వుందని, ఆ సినిమాలో మేటర్‌ లేదని ప్రచారాలు మొదలయ్యాయి. ఎవరికి వారు మా సినిమా గొప్పంటే మా సినిమా గొప్పంటూ ఎలాగో డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఎవరి డప్పు వారు కొట్టుకోవడంలో తప్పు లేదు కానీ పక్కవారి సినిమాని తక్కువ చేయకపోతే తమ సినిమాకి మనుగడ వుండదు కనుక బురద జల్లుడు షురూ చేసారు.

సెన్సార్‌ పూర్తయినది లగాయతు ఒక్కో సినిమా గురించి నెగెటివ్‌ ప్రచారం ముమ్మరమైంది. ఎంత నెగెటివిటీ స్ప్రెడ్‌ చేస్తే సదరు సినిమా అంతగా వెనక్కి పోతుందనేది వీరి ఎత్తుగడ. అయితే ఇలాంటి ట్రిక్కులు, గిమ్మిక్కుల ముందు జనాభిప్రాయం మారదనుకోండి.

కాకపోతే ఎర్లీ అడ్వాంటేజ్‌ కోసం కాంపిటీషన్‌ని తొక్కేయడమన్నది ఈ పోటీలో న్యాయబద్ధమే అనేది అందరి ఫీలింగ్‌. మెజారిటీ అభిప్రాయాన్ని తెలుసుకుని లేదా మీ అంతట మీరుగా చూసి నిర్ణయానికి వస్తే మంచిది తప్ప 'అంట' అంటూ చెప్పే కథల్ని నమ్మబోకండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు